
Mental Disorder: స్కూల్ కెళ్లే విద్యార్థి నుంచి వ్యాపారవేత్తల వరకు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అశాంతి.. మానసిక వేదన నేటి కాలంలో చూస్తున్నాం. చాలా మంది ఏదో ఒకే పనిపై ఎక్కువగా దృష్టి పెట్టడం.. వాటి కోసం నిత్యం తీవ్ర ఆందోళనకు గురికావడంతో మానసిక సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రతీ కుటుంబంలో ఒక్కరైనా మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. ఇది క్రమంగా ఆరోగ్య సమస్యకు దారి తీస్తోంది. దీంతో ప్రతీ ఇంట్లో వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం ఆరోగ్య సమస్యలపైనే ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఫలితంగా ఆర్థికంగా కుంగిపోయి పేదరికం పెరిగిపోతోంది. వీటన్నింటికి కారణం ఒత్తిడినే అని తెలుస్తోంది. ఈ విషయాలపై భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) జరిపిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
2018 జూలై- డిసెంబర్ మధ్య కాలాన్ని తీసుకొని ఐసీఎంఆర్ ఓ సర్వే చేసింది. ఇది అందించిన ప్రకారం దేశంలో 1.18లక్షల కుటుంబాలకు చెందిన 5.76 లక్షల మందిని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వారు వెల్లడించిన దానిని భట్టి చూస్తే 6,679 మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కుటుంబాలు చేస్తున్న వ్యయంలో 18.1 శాతం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిరక్షణ కోసం ఖర్చు పెట్టడం ద్వారా ఆర్థికంగా కుంగిపోయి పేదరికంలోకి మారుతున్నారు. ఈ సర్వే ప్రకారం దేశంలో 20.7 శాతం కుటుంబాలు పేదరికంలోకి వెళ్లాయి.
మనసిక రుగ్మతలపై దేశవ్యాప్తంగా అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాలను పరిశీలిస్తే సిక్కిం (31.9 శాతం), హిమాచల్ ప్రదేశ్ (23.9 శాతం), డామన్ డయ్యూ (23.4 శాతం), తెలంగాణ (22.2 శాతం), మహారాష్ట్ర (21.3 శాతం )వరుసగా ఉన్నాయి. మొత్తంగా 58.5 శాతం కుటుంబాలు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ఎక్కువగా ఈ రాష్ట్రాల వారే ఖర్చు చేస్తున్నట్లు తేలింది. దీనిని భట్టి చూస్తే భారత్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలో కొట్టుమిట్టాడున్నట్లు అర్థమవుతుందని అంటున్నారు. ఒత్తిడి, వ్యాకూలత, మానసిక అనారోగ్యాలతోనే వీరు బాధపడుతున్నారని తెలుస్తోంది.

మానసిక రుగ్మతలో అలాగే కొనసాగితే దీర్ఘ కాలిక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. అందువల్ల మొదట్లోనే ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఈ సర్వే అధ్యయన రచిత కొచ్చిలోని అమృత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్స్ సెంటర్ అధ్యాపకుడు డాక్టర్ డెన్నీ జాన్ తెలిపారు. అనారోగ్యాలపై ఖర్చును తగ్గించుకునేందుకు అనవసరమైన ఆలోచనలు, బావోద్వేగాలు, సంబంధాలు, మతిభ్రమణం వంటివి తగ్గించుకునేలా చూడాలని చెబుతున్నారు.