
Woman Life : మగవారి కంటే ఆడవారు ఎక్కువ కాలం జీవిస్తారు. ఇందులో మర్మమేమిటనే దానిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఓ పరిశోధన నిర్వహించింది. మహిళలు ఎక్కువ కాలం జీవించడంలో కొన్ని అంశాలు వారికి తోడ్పడతాయి. ఈ నేపథ్యంలో ఆడవారికి ఆయుష్షు ఎక్కువగానే ఉంటుంది. అందుకే భర్తలు త్వరగా చనిపోతే భార్యలు మాత్రం పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారు. దీనిపై చేసిన పరిశోధనలో పలు రకాల రహస్యాలు కనుగొన్నారు.
స్త్రీలు చాలా విషయాల్లో పురుషులకంటే భిన్నంగా ఉంటాయి. మగవారిలో కండరాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే బరువులు ఎత్తగలరు. ఎక్కువ వేగంగా నడవగలరు. ఆడవారికంటే మగాళ్లకు ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అందుకే ఆడవారు మగవారి కంటే ఎక్కువ కాలం జీవించడంలో ఆంతర్యమేమిటనే దానిపై చాలా రకాల పరిశోధనలు జరుగుతున్నాయి.
జీన్స్
ఆడవారిలో మగవారిలో 23 జతల క్రోమోజోమ్ లు ఉంటాయి. వీటిలో 22 జతలు ఒకేలా ఉన్నా ఒక జత మాత్రం భిన్నంగా ఉంటాయి. అవే ఆడవారిలో ఎక్స్ క్రోమోజోమ్ లు, మగవారిలో వై క్రోమోజోమ్ లు ఉంటున్నాయి. మగవారిలో ఉండే వై క్రోమోజోమ్ లలో రోగాలు వచ్చేవి ఎక్కువగా ఉండటంతో తొందరగా చనిపోతారని చెబుతున్నారు. దీంతోనే ఆడవారికి మగవారికి ఉండే తేడా అని తేల్చారు.

హార్మోన్లు
మగవారిలో టెస్టోస్టిరాన్ ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్లు ఉంటాయి. టెస్టోస్టిరాన్ మగవారిలో గుండెపోటు వచ్చేలా చేస్తుంది. ఈస్ట్రోజన్ మహిళల్లో గుండె సంబంధిత రోగాలు రాకుండా చేస్తాయి. అధ్యయనాల్లో కూడా ఇదే రుజువైంది. టెస్టోస్టిరాన్ గుండె కండరాలను బలహీనపరుస్తుంది. ఈ నేపథ్యంలో మగవారి ఆయుష్షును తగ్గించడంలో హార్మోన్ల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది.
ప్రొస్టేట్ గ్రంథి
మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి. ఇవి ఆడవారిలోనే ఎక్కువగా వస్తాయని తెలిసినా వీటి ప్రభావంతో మగవారే ఎక్కువగా చనిపోతున్నారు. క్యాన్సర్ ప్రభావం మగవారిలోనే ఎక్కువగా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇలా మగవారి ఆయుష్షు తగ్గించడంలో క్యాన్సర్ కూడా ఒక కారణంగానే నిలుస్తోంది.
గుండె జబ్బులు
ఆడవారి కంటే మగవారిలోనే గుండెపోటు ఎక్కువగా వస్తుంది. మహిళల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. డెసిలీటర్ కు 60.3 మి. గ్రా ఉంటుంది. అదే పురుషుల్లో 48.5 శాతం మాత్రమే ఉంటుంది. దీని వల్ల మగవారికే గుండెపోటు ఎక్కువగా వస్తుంది. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఆడవారు మగవారి కంటే ఎక్కువ కాలం బతుకున్నారు.