https://oktelugu.com/

పవన్ కళ్యాన్ అభిమానులకు గుడ్ న్యూస్

వకీల్ సాబ్ మూవీ ఇలా అయిపోనేలేదు.. అలా పవన్ కళ్యాణ్ ఏపీలోని ‘దివీస్’ బాధితుల కోసం పోరాడి.. ఇలా వచ్చి మళ్లీ కొత్త సినిమా షూటింగ్ స్ట్రాట్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ తన సినిమాల వేగంగా పెంచేశారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నారు. Also Read: ‘ఫైటర్’ కోసం రంగంలోకి పూరి జగన్నాథ్ పీఎస్ పీకే27 అనే వర్కింగ్ టైటిల్ తో విలక్షణ దర్శకుడు ‘క్రిష్ జాగర్లమూడి’ దర్శకత్వంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2021 / 10:10 PM IST
    Follow us on

    వకీల్ సాబ్ మూవీ ఇలా అయిపోనేలేదు.. అలా పవన్ కళ్యాణ్ ఏపీలోని ‘దివీస్’ బాధితుల కోసం పోరాడి.. ఇలా వచ్చి మళ్లీ కొత్త సినిమా షూటింగ్ స్ట్రాట్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ తన సినిమాల వేగంగా పెంచేశారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నారు.

    Also Read: ‘ఫైటర్’ కోసం రంగంలోకి పూరి జగన్నాథ్

    పీఎస్ పీకే27 అనే వర్కింగ్ టైటిల్ తో విలక్షణ దర్శకుడు ‘క్రిష్ జాగర్లమూడి’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో పవన్ కళ్యాన్ ఈరోజు చేరిపోయారు. ఈ విషయాన్ని తాజా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

    ‘ఈ శుభవార్తను అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పీఎస్ పీకే27 షూటింగ్ లో చేరిపోయారు అని ఈ చిత్ర నిర్మాణ సంస్థ ‘మెగా సూర్య ప్రొడక్షన్’ తాజాగా ఓ ట్వీట్ చేసింది.

    Also Read: ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ తాజా అప్ డేట్ ఇదే

    పవన్ కళ్యాన్ కోసం ‘క్రిష్’ ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఓ చారిత్రాత్మక కథ నేపథ్యంగా ఈ సినిమా ఉండబోతుంది. మొగలాయిల కాలం నాటి కథ ఇది. అప్పటి పాలన వాళ్ళ నిర్ణయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. దీనిలో ఔరంగజేబుదే కీలక పాత్రగా ఉంటుందట. ఈ పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుడిని సంప్రదిస్తున్నారట. ఈ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నారు దర్శక, నిర్మాతలు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు నటిస్తారని తెలుస్తుంది.