అరుదైన గౌరవం: ఆస్ట్రేలియా స్టాంప్ పై ఈ తెలుగు హీరో..

తెలుగు హీరోలు తెలుగు రాష్ట్రాల్లో తెలుసు. పక్కరాష్ట్రంలోని ఫ్యాన్స్ కు కూడా తెలియదు.. కరోనా లాక్ డౌన్ పుణ్యమాని ఇప్పుడు అన్ని హీరోల సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కాస్తో కూస్తో పరభాష వాళ్లకు మన వాళ్ల సినిమాలు చేరి వారికి కూడా మన హీరోల గురించి తెలుస్తోంది. Also Read: పవన్ కళ్యాన్ అభిమానులకు గుడ్ న్యూస్ అయితే తెలుగు వారు ఎక్కడున్నా సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని వారుండరు. టాలీవుడ్ మూలస్తంభాల్లో ఒకరాయన.. ఎన్నో […]

Written By: NARESH, Updated On : January 12, 2021 10:03 am
Follow us on

తెలుగు హీరోలు తెలుగు రాష్ట్రాల్లో తెలుసు. పక్కరాష్ట్రంలోని ఫ్యాన్స్ కు కూడా తెలియదు.. కరోనా లాక్ డౌన్ పుణ్యమాని ఇప్పుడు అన్ని హీరోల సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ కాస్తో కూస్తో పరభాష వాళ్లకు మన వాళ్ల సినిమాలు చేరి వారికి కూడా మన హీరోల గురించి తెలుస్తోంది.

Also Read: పవన్ కళ్యాన్ అభిమానులకు గుడ్ న్యూస్

అయితే తెలుగు వారు ఎక్కడున్నా సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని వారుండరు. టాలీవుడ్ మూలస్తంభాల్లో ఒకరాయన.. ఎన్నో చిత్రాల్లో నటించి .. ఎన్నో అవార్డులు పొందిన కృష్ణకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గొప్ప గౌరవాన్ని ఇచ్చింది.

ఆస్ట్రేలియాలోని కృష్ణ అభిమానుల కోరిక మేరకు అక్కడి ప్రభుత్వం కృష్ణ పేరుతో ఒక స్టాంప్ ను విడుదల చేసింది. 1.65 డాలర్ విలువ ఉండే ఈ స్టాంప్ ను కృష్ణ పేరిట ఆస్ట్రేలియా ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవలే కృష్ణకు ఆ స్టాంప్ ను అభిమానులు అందజేశారు.

Also Read: ‘ఫైటర్’ కోసం రంగంలోకి పూరి జగన్నాథ్

ఈ సందర్భంగా కృష్ణకు లభించిన ఈ గౌరవంపై మహేష్, కృష్ణ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు, కృష్ణకు దక్కిన గౌరవం ఇదని కొనియాడారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్