ఏపీని షేక్ చేసిన జడ్జీల ఆడియో టేపుల కేసు.. సుప్రీంకోర్టులో షాక్

ఏపీలోని న్యాయవ్యవస్థలో చోటుచేసుకున్న ఒక ఇద్దరు జడ్జిల మధ్య సంభాషణ అప్పట్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశమైంది.. న్యాయవ్యవస్థపై జస్టిస్ ఈశ్వరయ్య చేశారని చెబుతున్న వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు అప్పట్లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తితో జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఫిర్యాదు దారు అయిన మరో జడ్జి రామకృష్ణను తన వద్ద ఉన్న సాక్ష్యాలను విచారణలో అందించాలని కోరింది. అవసరమైతే సీబీఐ, సెంట్రల్ […]

Written By: NARESH, Updated On : January 12, 2021 10:13 am
Follow us on

ఏపీలోని న్యాయవ్యవస్థలో చోటుచేసుకున్న ఒక ఇద్దరు జడ్జిల మధ్య సంభాషణ అప్పట్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశమైంది.. న్యాయవ్యవస్థపై జస్టిస్ ఈశ్వరయ్య చేశారని చెబుతున్న వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు అప్పట్లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తితో జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఫిర్యాదు దారు అయిన మరో జడ్జి రామకృష్ణను తన వద్ద ఉన్న సాక్ష్యాలను విచారణలో అందించాలని కోరింది. అవసరమైతే సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు సహకరించాలని అప్పట్లో హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో కిలో చికెన్ ఎంతంటే..?

జస్టిస్ ఈశ్వరయ్య న్యాయవ్యవస్దపై చేశారని చెబుతున్న ఆరోపణలకు సంబంధించిన ఆడియో రికార్డు ఉన్న పెన్‌డ్రైవ్‌ను జడ్జి రామకృష్ణ హైకోర్టుకు అందించారు. దీనిపై నిజ నిర్ధారణ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు జడ్జి ఈశ్వరయ్య వెళ్లగా అక్కడా చుక్కెదురైంది.
జడ్జి రామకృష్ణతో జరిపిన ఫోన్ సంభాషణపై విచారణకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

జడ్జి రామకృష్ణతో మాట్లాడింది నిజమేనని ఈశ్వరయ్య తరుఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంగీకరించారు. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

Also Read: ‘పంచాయితీ’కి చెక్.. నిమ్మగడ్డకు షాక్.. హైకోర్టులో ఇక జగన్ కు తిరుగులేదా?

జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్‌లో జడ్జి రామకృష్ణ మాట్లాడి బెదిరించినట్లు ఱరోపణలు వచ్చాయి. ఈ సమయంలో న్యాయమూర్తులపైనా ఆయన ఆరోపణలు చేసినట్లు రామకృష్ణ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టుకు ఈశ్వరయ్య వెళ్లగా దీనిపై చుక్కెదురైంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్