https://oktelugu.com/

Golden Tortoise : బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది.. ఈ బంగారు తాబేలు పుట్టింది..!

Golden Tortoise : పోతులూరి వీరబ్రహ్మం అప్పట్లోనే  ‘కాలజ్ఞానం’ చెప్పి భవిష్యత్తును అంచనా వేశారు. ఇప్పుడు ఆయన చెప్పిందే నిజమైంది. ‘చైనా దేశంలో కరోనా అనే పురుగు పుట్టి చంపేస్తుందని’ బ్రహ్మంగారు అన్నట్టే ఇప్పుడు జరుగుతోంది. ఇక ఆయన చెప్పిన ఎన్నో వింతలు విశేషాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. కలియుగంలో వింతగా ఏది జరిగినా బ్రహ్మంగారు ముందే చెప్పారు అని వార్తలు వస్తుంటాయి. అలానే ఈసారి బ్రహ్మంగారు చెప్పినట్టే మరో వింత జరిగింది. అదే బంగారు తాబేలు జననం.. ప్రస్తుతం […]

Written By:
  • NARESH
  • , Updated On : April 12, 2022 / 10:44 AM IST
    Follow us on

    Golden Tortoise : పోతులూరి వీరబ్రహ్మం అప్పట్లోనే  ‘కాలజ్ఞానం’ చెప్పి భవిష్యత్తును అంచనా వేశారు. ఇప్పుడు ఆయన చెప్పిందే నిజమైంది. ‘చైనా దేశంలో కరోనా అనే పురుగు పుట్టి చంపేస్తుందని’ బ్రహ్మంగారు అన్నట్టే ఇప్పుడు జరుగుతోంది. ఇక ఆయన చెప్పిన ఎన్నో వింతలు విశేషాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి.

    కలియుగంలో వింతగా ఏది జరిగినా బ్రహ్మంగారు ముందే చెప్పారు అని వార్తలు వస్తుంటాయి. అలానే ఈసారి బ్రహ్మంగారు చెప్పినట్టే మరో వింత జరిగింది. అదే బంగారు తాబేలు జననం..

    ప్రస్తుతం పుట్టిన బంగారు తాబేలు గురించి అందరూ ఆరాతీస్తూ ఇది బ్రహ్మంగారు చెప్పిందేనని అంటున్నారు. బంగారు కవచంతో ఓ తాబేలు నేపాల్ దేశంలో జన్మించింది. నేపాల్ లో తాబేళ్లను దేవుడిగా పూజిస్తారు. బంగారు రంగులో ఉన్న ఈ తాబేలు మెరుస్తూ చూడగానే బంగారు తాబేలునేనని అంటున్నారు. అలా ఇది మెరుస్తుంది కూడా..

    దీంతో బ్రహ్మంగారు చెప్పినట్టే బంగారు తాబేలు పుట్టిందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే బంగారు తాబేలు పుట్టదని.. జన్యు లోపాల కారణంగానే తాబేలు ఇలా రంగు మారుతాయని నిపుణులు అంటున్నారు. భక్తులు మాత్రం ఈ తాబేలు దేవుడి సృష్టి అని దీనికి వేల పూజలు చేస్తున్నారు.

    Also Read: RRR Release: ఏప్రిల్ 28న ‘ఆర్ఆర్ఆర్’ ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా? ఆ డేట్ వెనుక పెద్ద కథ?