
Game Changer Release Date: ప్రస్తుతం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో ఒకటి ‘గేమ్ చేంజర్’.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వీటికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర కూడా రామ్ చరణ్ యే పోషిస్తున్నాడు.ఎలెక్టోరల్ ఆఫీసర్ గా మరియు అభ్యుదయ పార్టీ అధినేత గా రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్నాడు. మొన్న విడుదలైన మోడరన్ లుక్ ఫోటో ఎలెక్టోరల్ ఆఫీసర్ కి సంబంధించినది. త్వరలోనే రామ్ చరణ్ రెండవ గెటప్ కి సంబంధించిన లుక్ ని కూడా విడుదల చేయబోతున్నారట.
ఇదివరకే ఈ లుక్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.రాజకీయ నాయకుడి గెటప్ లో రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా కనిపించాడు.అయితే త్వరలో విడుదల చెయ్యబోతున్న సెకండ్ లుక్ ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడని లుక్ అట. ఫ్యాన్స్ కి ఈ లుక్ చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయమని అంటున్నారు. ఈ సెకండ్ వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇందులో హీరోయిన్స్ గా కియారా అద్వానీ మరియు అంజలి నటిస్తుండగా,శ్రీకాంత్ , సునీల్ , SJ సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశకి చేరుకున్న ఈ సినిమాని ఈ ఏడాది లోపే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవ్వగానే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి.