Homeఎంటర్టైన్మెంట్Allu Aravind- Ram Charan: నా మేనల్లుడు వల్ల మెగా ఫ్యామిలీ రేంజ్ మారిపోయింది అంటూ...

Allu Aravind- Ram Charan: నా మేనల్లుడు వల్ల మెగా ఫ్యామిలీ రేంజ్ మారిపోయింది అంటూ రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచేసిన అల్లు అరవింద్

Allu Aravind- Ram Charan
Allu Aravind- Ram Charan

Allu Aravind- Ram Charan: మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు ఎప్పటికీ పదిలంగా దాచుకునే జ్ఞాపకం #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు రావడమే. బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా,ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రపంచం మొత్తాన్ని ఊపేసింది.

ఆ పాట ఆ రేంజ్ లో రీచ్ అవ్వడానికి ప్రధాన కారణం డైరెక్టర్ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్ – ఎన్టీఆర్, సంగీత దర్శకుడు కీరవాణి మరియు లిరిక్ రైటర్ చంద్ర బోస్. కానీ ఆస్కార్ అవార్డుని గెలుపొందింది కీరవాణి మరియు చంద్ర బోస్. దీనిపై మెగా మరియు నందమూరి అభిమానులకు కాస్త నిరాశ చెందినప్పటికీ మా తరుపున వాళ్లిద్దరూ అవార్డు తీసుకున్నారు, ఎవరు తీసుకుంటే ఏముందిలో, కలలో కూడా సాధ్యం కాదు అనుకున్న పనిని నెరవేర్చుకొని వచ్చారు అంటూ సంతృప్తి చెందారు. ఇది ఇలా ఉండగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకొని, నిన్న హైదరాబాద్ లో ‘ఆస్కార్ వేడుక’ అనే ఈవెంట్ ని ఏర్పాటు చేసారు.

Allu Aravind- Ram Charan
Allu Aravind- Ram Charan

ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తప్ప మూవీ టీం మొత్తం పాల్గొన్నది, వీరితో పాటుగా ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. వారిలో అల్లు అరవింద్ కూడా ఒక్కడు. ఈయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, ఆయన మాట్లాడుతూ ‘ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో మన తెలుగోడు కూర్చుంటే చాలు అనుకునే వాడిని, కానీ రాజమౌళి అద్భుతమైన విజన్ ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ జరిగే డాల్బీ అట్మాస్ థియేటర్ లో రాజమౌళి, కీరవాణి , చంద్రబోస్ , నా మేనల్లుడు రామ్ చరణ్, అలాగే మన అందరీ లవబుల్ హీరో ఎన్టీఆర్ ని చూసిన తర్వాత నోటి నుండి మాట రాలేదు’ అంటూ అల్లు అరవింద్ ఈ సందర్భంగా మాట్లాడాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో మీరే చూడండి.

Ram Charan Changed Our Mega Family Range To International Level | Allu Aravind | TeluguCinemaBrother

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Oktelugu Epaper
Exit mobile version