
Allu Arjun- Rashmika Mandanna: సోషల్ మీడియా అన్న తర్వాత పుకార్లు రావడం అనేది సర్వసాధారణం.అప్పట్లో సెలెబ్రిటీలు సైతం దీనిపై చాలా బలంగా రియాక్ట్ అయ్యేవారు. కానీ సోషల్ మీడియా అభివృద్ధి చెంది అలా పుకార్లు పుట్టించే వాళ్ళు లక్షల సంయలో పుట్టుకొస్తుండడం తో ఎంతమందిని అని ఆపుతాము,పుకార్లు పుట్టిస్తే పుట్టించారులే, మన పని మనం చేసుకుంటూ పోదాం, అనుకొని సెలెబ్రిటీలు ఈ రూమర్స్ ని పట్టించుకోవడం మానేశారు.
అలా పట్టించుకోవడం మానేశారు, మనకి ఇక ఏమి ఇబ్బంది లేదులే అని కొంతమంది హద్దులు దాటి మరీ పుకార్లు పుట్టిస్తూ కాలం గడిపేస్తున్నారు. అలా ఇప్పుడు ట్విట్టర్ లో ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ అని చెప్పుకునే ఉమర్ సందు ఈమధ్య నోటికి ఏది వస్తే అది వేసేస్తున్నారు. టాలీవుడ్ , బాలీవుడ్ మరియు కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ స్టార్ హీరో పై పుకార్లు పుట్టించేస్తున్నాడు .
రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద అలాంటి పుకారు పుట్టించాడు,ఆయన పుట్టినరోజు నాడు రష్మిక మరియు దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి అల్లు అర్జున్ తన ప్రైవేట్ ఫ్లైట్ లోపల కూర్చొని దిగిన ఫోటోని సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ‘అల్లు అర్జున్ తన కొత్త ప్రేయసి తో కలిసి ప్రైవేట్ ట్రిప్స్ వేస్తున్నాడు’ అంటూ ట్వీట్ వేసాడు.పుట్టినరోజు అప్పుడు కూడా ఇలా పుకార్లు పుట్టించడం చూసి నెటిజెన్స్ అతని పై కామెంట్స్ లో గాండ్రించి ఊస్తున్నారు.

ఇంత దిగజారి కామెంట్స్ చెయ్యడానికి సిగ్గు లేదా, కడుపుకి అన్నమే తింటున్నావా అంటూ ఇతనిని తిడుతున్నారు.ఇతనికి ఈ తిట్లు కొత్తేమి కాదు, గతం ప్రభాస్ , మహేష్ బాబు , రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలపై కూడా ఇలాగే పుకార్లు పుట్టించి అబాసుపాలయ్యాడు.ఎన్ని తిట్లు తిన్నా మనకి రావాల్సిన పాపులారిటీ మనకి వస్తుంది చాలు అనుకొని బ్రతుకుతున్న ఇతగాడి పై భవిష్యత్తులో ఎవరైనా యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాలి.