
AP New Governor Abdul Nazeer: ఏపీలో గత మూడున్నరేళ్లుగా వికృత పాలన సాగింది. జగన్ అధికార యంత్రాంగాన్ని ప్రైవేటు ఆర్మీ మాదిరిగా మార్చేశారన్న విమర్శలున్నాయి. ఆ వ్వవస్థా..ఈ వ్యవస్థా అన్న తేడా లేకుండా అన్నింటితోనూ జగన్ సర్కారు ఆడుకుంది. పరిస్థితులు మరీ శృతిమించుతున్నాయి. చివరికి న్యాయవ్యవస్థ జోక్యంపై కూడా ప్రశ్నలు వేశారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. సరిగ్గా ఇటువంటి సమయంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లూ జగన్ సర్కారుకు కేంద్ర పెద్దలు సహకరిస్తున్నారన్న కామెంట్స్ కు చెక్ చెబుతూ రాష్ట్ర గవర్నర్ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను నియమించారు. ఆయనకేమీ రాజకీయ నేపథ్యం లేదు. ఈ ఏడాది జనవరి 4న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. వెనువెంటనే ఆయన్ను గవర్నర్ గా ఎంపిక చేయడం, ఏపీకి నియమించడం చకాచకా జరిగిపోయాయి.
Also Read: NTR 30: ఎన్టీఆర్ 30పై ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్!
అయితే తాజాగా గవర్నర్ గా జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నియామకం వెనుక భారీ స్కెచ్ నడిచినట్టు ప్రచారం సాగుతోంది. మొత్తం బ్యూరోక్రట్ల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకూ జగన్ సర్కారు తన సొంత సైన్యంలా భావిస్తున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి లేకుండా విధ్వంసాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. సంక్షేమం మాటున రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీని కలిసిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించానని అప్పట్లో చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో దిగజారుతున్న పరిస్థితులు, శాంతిభద్రతలు, అధికార పార్టీ దురాగతాలపై నివేదిక ఇచ్చినట్టు పేర్కొన్నారు. దాని ఫలితమే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి గవర్నర్ గా ఎంపిక అని ప్రచారం సాగుతోంది.
జస్టిస్ అబ్ధుల్ నజీర్ అనుభవమున్న న్యాయనిపుణుడు. కీలక తీర్పులు వెలువరించిన నేపథ్యం ఉంది. ఆయన స్వరాష్ట్రం కర్నాటక. 1983లో బార్ కౌన్సిల్ లో అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు. కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎలివేట్ అయ్యారు. చరిత్రాత్మకమైన బాబ్రీమసీదు-రామజన్మభూ వివాదంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. అటువంటి వ్యక్తిని ఏరికోరి ఏపీకి పంపించడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఇచ్చిన నివేదికతోనే ప్రధాని స్పందించిన ఈ న్యాయ నిపుణుడ్ని ఏపీకి నియమించినట్టు తెలుస్తోంది.

అయితే ఇలా గవర్నర్ నియామకమయ్యారో లేదో.. పవన్ స్పందించారు. కర్మ సిద్ధాంతాన్ని గుర్తుచేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఏపీకి గట్టి హెచ్చరికల సంకేతాలు వచ్చినట్టేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కొందరు బ్యూరోక్రట్లు బాధ్యతలను గుర్తెరగాలన్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం కర్మ కాన్సెప్ట్ ను అర్ధం చేసుకోవాలన్నారు. కర్మ అనేది యూనివర్సల్ లా అని గుర్తుచేశారు. మనం ఏం విత్తుతామో.,. అదే మొలకెత్తుతుందని..అదే సూత్రాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ కామెంట్స్ ను పవన్ గుర్తుచేశారు. ఏపీలో వైసీపీ సర్కారు వికృత క్రీడకు పాల్పడుతుందంటూ అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన జస్టిస్ గోపాలగౌడచేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇన్నాళ్లూ న్యాయవ్యవస్థతో ఆడుకున్న జగన్ అండ్ కోకు న్యాయనిపుణుడు గవర్నర్ గా ఎంపిక కావడం మింగుడుపడడం లేదు. అదే సమయంలో పవన్ స్పందించడంతో ఆయన్ను సంప్రదించే కేంద్రం నియామకం చేపట్టి ఉండవచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read:Drug Cases In Kerala: స్కూల్ డెస్క్ లు, బ్యాగ్ లలో డ్రగ్స్.. ప్రగతి శీల రాష్ట్రంలో ఉడ్తా పంజాబ్