
NTR 30: ఆర్ ఆర్ ఆర్ ప్రభంజనం ఇంకా ముగియలేదు. ఆస్కార్ బరిలో నిలిచిన రాజమౌళి విజువల్ వండర్ అద్భుతం చేస్తుందని అందరూ నమ్ముతున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కి నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ఆర్ ఆర్ ఆర్ తో వరల్డ్ వైడ్ పాపులారిటీ రాబట్టారు. వీరి గురించి అమెరికన్ మీడియాలో చర్చ నడుస్తోంది. దర్శక దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఆర్ ఆర్ ఆర్ హీరోలను పొగడ్తలతో ముంచెత్తారు. మరోవైపు చరణ్, ఎన్టీఆర్ తమ తమ చిత్రాలతో బిజీ కానున్నారు.
Also Read: Drug Cases In Kerala: స్కూల్ డెస్క్ లు, బ్యాగ్ లలో డ్రగ్స్.. ప్రగతి శీల రాష్ట్రంలో ఉడ్తా పంజాబ్
చరణ్ చాలా స్పీడ్ గా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ అనంతరం ఆయన ఆచార్య మూవీతో ప్రేక్షకులను పలకరించారు. అలాగే దర్శకుడు శంకర్ తో చేస్తున్న ఆర్సీ 15 షూట్ చాలా వరకు కంప్లీట్ చేశారు. ఎన్టీఆర్ మాత్రం మరో సినిమా స్టార్ట్ చేయలేదు. దర్శకుడు త్రివిక్రమ్ తో ఆయన మూవీ ప్రకటించారు. ఆ ప్రాజెక్ట్ డిలే అయ్యింది. దీంతో కొరటాల శివతో నెక్స్ట్ మూవీ లాక్ చేశారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా చాలా నాటకీయత చోటు చేసుకుంది. అనుకున్న సమయానికి ఏడాదికి పైగా ఆలస్యమైంది.
స్క్రిప్ట్ పట్ల సంతృప్తిగా లేని ఎన్టీఆర్ మార్పులు చేర్పులు కోరారని అందుకే ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. ఒక దశలో మూవీ ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది. మూవీ ఆగిపోలేదని కొరటాల పరోక్షంగా తెలియజేశారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేసి ఒక స్పష్టత ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ 30 నుండి అప్డేట్స్ లేవు, సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో అన్న క్లారిటీ లేదు. ఇది ఫ్యాన్స్ ని తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. అభిమానులు పెద్ద ఎత్తున అల్లరి చేయడంతో అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.

తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 23న ఎన్టీఆర్ 30 పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారట. మార్చి మూడవ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. ఇక ఫస్ట్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ ఏర్పాటు చేశారట. అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. ఇక ఎన్టీఆర్ 30 హీరోయిన్ ఎవరనేది అధికారిక ప్రకటన చేయలేదు. పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Blood Sugar Levels: రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గడానికి ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?