
Weight Loss Tips: ఇటీవల కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే పెద్ద వారిలా మారపోతున్నారు. చూస్తే వయసు మళ్లిన వారిలో కనిపిస్తున్నారు. దీంతో బరువును ఎలా తగ్గించుకోవాలనే దానిపై నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అధిక బరువు అనర్థమని తెలియడంతో ఎలా అదుపు చేసుకోవాలనే దానిపై దృష్టి సారిస్తున్నారు. సరైన మార్గాలు తెలియక సతమతమవుతున్నారు. అధిక బరువుతో మన శరీరానికి ఎన్నో ఇబ్బందులొస్తాయి. మోకాళ్ల చిప్పలు అరిగి కీళ్లనొప్పులు బాధిస్తాయి. ఈ నేపథ్యంలో ఊబకాయం ముప్పును ఎదుర్కోవడానికి ఎంతో శ్రమించాల్సి వస్తోంది.
Also Read: AP New Governor Abdul Nazeer: జగన్ చాప్టర్ క్లోజ్ యేనా? పవన్ కోసమే కొత్త గవర్నర్ ను మోడీ దింపాడా?
నిద్ర లేచాక..
ఉదయం నిద్ర లేచిన నుంచే బరువు తగ్గించే పనులు మొదలు పెట్టాలి. దీనికి గాను ఉదయమే మన బరువును కొలుచుకోవాలి. కాలకృత్యాలు తీర్చుకున్నాక ఖాళీ కడుపుతో బరువు తూచుకుని పరిశీలించుకోవాలి. అలా కాకుండా ఏ మధ్యాహ్నమో, సాయంత్రం తూచుకుంటే మనం తిన్న పదార్థాలతో అధిక బరువు అవుతాం. అందుకే ఉదయాన్నే కొలుచుకుని తదనంతర కార్యక్రమాల్లోకి వెళ్లాలి. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలను ముమ్మరంగా పాటించాలి.
టిఫిన్ కు ముందు..
మనం టిఫిన్ తినడానికి ముందు ఓ గ్లాసు నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. నీటిలో కేలరీలు ఉండకపోవడంతో కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. దీంతో మనం ఎక్కువగా తినకుండా దోహదపడుతుంది. టిఫిన్ ఎక్కువగా తినకుండా చేస్తుంది. నీటితో జీవక్రియల వేగం పెరుగుతుంది. ఇది కేలరీలు ఖర్చు కావడానికి సాయం అందిస్తుంది. ఇలా మనం బరువు తగ్గించుకునే క్రమంలో నీళ్లు తాగితే ఎంతో మేలు జరుగుతుంది. దీనికి గాను అందరు ఈ పద్ధతి పాటించడం సరైనదే.
వ్యాయామం
టిఫిన్ తినడానికి ముందు వ్యాయామం చేయడం మంచిది. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. శరీరంలో కొవ్వు కరుగుతుంది. శరీరం కొవ్వును వినియోగించుకుంటుంది. అదనపు కొవ్వును కరిగిస్తుంది. అల్పాహారంలో కాస్త ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే ఉత్తమం. ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రొటీన్లను జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎక్కువ కేలరీలను ఉపయోగించుకుంటుంది. అల్పాహారంలో మినుములు, పెసలు, వేరుశనగ వంటి వాటిని తీసుకుంటే ప్రొటీన్లు ఎక్కువగా అందుతాయి.

వేపుళ్లకు దూరంగా..
వేపుళ్లకు దూరంగా ఉండాలి. ఫిజాలు, బర్గర్లు వంటివి తినకూడదు. వాటి వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఉదయం పూట శరీరానికి కాస్త ఎండ తగిలేలా చూసుకోవాలి. ఎండలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మన దేహానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో కొవ్వు కరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం బరువును తగ్గించుకునేందుకు పలు మార్గాలు పాటించాలి. లేకపోతే అధిక బరువు మనకు ఎన్నో అనర్థాలు తెస్తుందనడంలో సందేహం లేదు.
లంచ్ విషయంలో..
మధ్యాహ్న భోజనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చిరుతిండ్లు, పండ్లు వంటివి ఉండేలా చూసుకోవాలి. ఆకలి వేసినప్పుడు మంచి ఆహారం తినాలి. సమోసాలు, పకోడీలు వంటి నూనె వస్తువులను కాకుండా పీచు పదార్థాలు ఉండే వాటిని ఎంచుకోవడం ఉత్తమం. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. ఇలా మన బరువును కంట్రోల్ చేసుకునేందుకు పై పద్ధతులు పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
Also Read: Spring Onion Benefits: ఉల్లికాడలను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?