
CM KCR: దేశంలో రైతుల తుపాను రాబోతోందని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈమేరకు నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో అపార సహజ వనరులున్నా ఎందుకు వినియోగించుకోవం లేదని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా నదులు పుట్టిన ప్రాంతమైన సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదు. తెలంగాణలో చేసిన అభివృద్ధి ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదు. పాలకుల సత్తా ఇదేనా? ప్రజలకు సదుపాయాలు కల్పించడంలో ఎందుకు విఫలమవుతున్నారు.
తెలంగాణలో దళితులకు దళితబంధు ఇస్తున్నాం. రైతు బంధు ఇస్తున్నాం. అన్ని వర్గాలను ఆదుకుంటున్నాం. కానీ ఇక్కడ అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా వనరులున్నా అవసరాలు తీరడం లేదు. ప్రజలను పట్టించుకోవడం లేదు. రైతుల సమస్యలు తీర్చడంలో సర్కారు నిర్లక్ష్యం చూపుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయినా పేదల బతుకుల్లో వెలుగులు కనిపించడం లేదు. కాంగ్రెస్ 54, బీజేపీ 14 ఏళ్లు పాలించినా ప్రజల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.

దేశంలో 360 మిలియన్ల బొగ్గు ఉండటంతో దేశమంతా ఉచిత కరెంటు ఇవ్వొచ్చు. తెలంగాణలో 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. మరి మహారాష్ట్రలో ఎందుకు ఇవ్వడం లేదు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఆ పథకాలు ఎందుకు పెట్టడం లేదు. తెలంగాణలో మాదిరి పథకాలు ఇక్కడ పెట్టే వరకు నేను వస్తుంటాను. ఇక్కడి ప్రభుత్వంలో మార్పు వచ్చేంత వరకు వస్తూనే ఉంటా. ప్రజల బతుకులు మారే వరకు పోరాడుతూనే ఉంటాం. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ధ్యేయం. ప్రతి జిల్లా పరిషత్ పై గులాబీ జెండా ఎగరాలి. ఫసల్ బీమా యోజన డబ్బులు ఎవరికైనా అందాయా. రైతుల సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలం అయింది. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక గాలి వీస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే ప్రధాన ధ్యేయం. దీని కోసం అన్ని పార్టీలను కలుపుకుని వెళతాం. అందరితో జట్టు కడతాం. బీజేపీయేతర ప్రభుత్వం కోసం సర్వశక్తులు ఒడ్డుతాం. బీజేపీకి గుణపాఠం చెబుతామని చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు దెబ్బతినడం ఖాయం. మూడో కూటమి ఏర్పాటుతో రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తాం.