ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ అనసూయ. ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నా అడపాదడపా సినిమాలలో వెండితెరపై కూడా అనసూయ వరుస అవకశాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ వివిధ అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది.
నెటిజన్లలో ఎవరైనా ట్రోల్ చేస్తే వారికి అదిరిపోయే పంచులు వేసి సమాధానం చెప్పడం అనసూయ ప్రత్యేకత. తాజాగా అనసూయ ఒక అంశం గురించి స్పందించిన తీరు ఆమెను వార్తల్లో నిలిపింది. ఒక సీనియర్ హీరో చేసిన కామెంట్ గురించి స్పందిస్తూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోవడంపై ప్రముఖ నటుడు మాధవన్ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేవారిని వదిలిపెట్టవద్దని పోస్ట్ చేశారు.
దేవుడు ఉన్నాడనే భయాన్ని కలిగించాలని.. చట్టాలను కఠినతరం చేయాలని.. టీనేజ్ యువకులైనా వారిని వదిలిపెట్టవద్దని పేర్కొన్నారు. తాను ప్రతిరోజూ ఆన్ లైన్ లో అలాంటి తిట్లను, వేధింపులను ఎదుర్కొంటానని తెలిపారు. అసభ్యంగా ప్రవరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాల్లో మార్పులు రావాలని తాను కోరుకుంటానని చెప్పారు. మనలో చాలామందికి ఆన్ లైన్ లో వేధింపులు నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
మనం బలహీనమైన క్షణాల్లో ఉన్నప్పుడు అలాంటి కామెంట్లను చూస్తే పరిస్థితేంటి..? అని ప్రశ్నించారు. కొందరు నెటిజన్లు అనసూయ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా ఆమెను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. కొన్ని కామెంట్లకు అనసూయ స్పందిస్తూ మెజారిటీ కామెంట్ల విషయంలో సైలెంట్ గా ఉంటున్నారు.