ఉత్కంఠ: జగన్ మళ్లీ ఢిల్లీ పర్యటన.. ఏం జరుగనుంది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళుతున్నారట.. నేడు లేదా రేపు ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. వారం రోజుల్లో రెండో సారి జగన్ ఢిల్లీ పర్యటన చేయడంపై సర్వాత్రా ఆసక్తి రేపుతోంది. తొలిసారి ప్రధాని మోడీని కలవగానే సుప్రీం కోర్టు న్యాయమూర్తిని టార్గెట్ చేసిన జగన్ ఇప్పుడు రెండోసారి ఏం చేస్తారనేది ఉత్కంఠి రేపుతోంది. ఈ పర్యటనలో రాష్ర్టపతి కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీల అపాయింట్ మెంట్ జగన్ కోరారు. […]

Written By: NARESH, Updated On : October 13, 2020 10:15 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళుతున్నారట.. నేడు లేదా రేపు ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. వారం రోజుల్లో రెండో సారి జగన్ ఢిల్లీ పర్యటన చేయడంపై సర్వాత్రా ఆసక్తి రేపుతోంది. తొలిసారి ప్రధాని మోడీని కలవగానే సుప్రీం కోర్టు న్యాయమూర్తిని టార్గెట్ చేసిన జగన్ ఇప్పుడు రెండోసారి ఏం చేస్తారనేది ఉత్కంఠి రేపుతోంది. ఈ పర్యటనలో రాష్ర్టపతి కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీల అపాయింట్ మెంట్ జగన్ కోరారు. దీంతో ఈ పర్యటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: ఏపీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలకు అన్ని రకాలుగా అడ్డుపుల్లలు పడుతున్నాయి. ఓ వైపు ప్రతిపక్షాల విమర్శలు.. మరో వైపు కోర్టు కేసులతో సమమతమవుతున్నాడు. ఇందులో భాగంగా తన కార్యక్రమాలకు ఎలాంటి ఆవాంతరాలు లేకుండా చూసుకునేందుకే రాష్ర్టపతి, ప్రధానిని కలిసేందుకే వెళ్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఏపీ సీఎం జగన్ స్వయంగా చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తూ సుప్రీంకోర్టు జడ్జిపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఇక వైసీపీ నేతలు హైకోర్టు జడ్జీలపై నోరుజారిన వ్యాఖ్యలపై సోమవారం సీబీఐ విచారణ చేయాల్సిందిగా ఏపీ హైకోర్టు కోరడంపై జగన్ సర్కార్ ను ను ఇరుకున పెట్టినట్లయింది. దీంతో ఈ విషయంపై చర్చించనున్నారా..? ఏం చేయనున్నారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు సుప్రీకోర్టు జడ్జికి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖను జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది.

గతంలో జగన్ ఢిల్లీ పర్యటనపై వైసీపీ నాయకులు రాష్ట్రప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారని చెప్పారు. అయితే ప్రస్తుత పరిణామాలపైనే సీఎం జగన్ మరోసారి కేంద్రంలోని పెద్దలను కలుస్తారని పార్టీలో చర్చించుకుంటున్నారు.

Also Read: సీఎం జగన్ కు మరో షాక్.. లిమిట్స్ అన్నీ దాటేశారంటూ సుప్రీంలో పిటిషన్..?

ఏదీ ఏమైనా ఈసారి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన మంత్రితో పాటు రాష్ర్టపతి అపాయింట్ మెంట్ తీసుకుంటున్నారు.. నేరచరితుల కేసులు పరిష్కారం కోసం జగన్ ఢిల్లీ వెళ్తున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు. మరి ఢిల్లీ పర్యటన తరువాత ఏపీ ముఖ్యమంత్రి ఏం చెబుతాడో చూద్దాం..