https://oktelugu.com/

ఉత్తరాంధ్ర సవాల్: ఏపీ మంత్రులు.. బాబుపై నెగ్గుతారా..?

వైసీపీ పార్టీలోకి వెళ్లిన వారికి వారు ఊహించని పదవులు వరించాయి. ముఖ్యంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారు సైతం మంత్రి సీట్లో కూర్చున్నారు. కొంచెం అనుభవం ఉంటే ప్రాధాన్యత మంత్రి పదవినే దక్కించుకున్నారు. వీరిలో  శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను ఉదాహరణగా తీసుకోవచ్చు. తనకు మంత్రి పదవి వస్తే చాలనుకున్న ధర్మాన కృష్ణ దాస్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన సీదరి అప్పలర్రాజుకు తాను ఊహించకముందే మంత్రి పదవి దక్కింది. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 / 09:13 AM IST
    Follow us on

    వైసీపీ పార్టీలోకి వెళ్లిన వారికి వారు ఊహించని పదవులు వరించాయి. ముఖ్యంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారు సైతం మంత్రి సీట్లో కూర్చున్నారు. కొంచెం అనుభవం ఉంటే ప్రాధాన్యత మంత్రి పదవినే దక్కించుకున్నారు. వీరిలో  శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను ఉదాహరణగా తీసుకోవచ్చు. తనకు మంత్రి పదవి వస్తే చాలనుకున్న ధర్మాన కృష్ణ దాస్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన సీదరి అప్పలర్రాజుకు తాను ఊహించకముందే మంత్రి పదవి దక్కింది.

    Also Read: ఏపీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

    అనుహ్యంగా పదవులు వరించిన వీరు ఆ పదవులకు రాజీనామా చేస్తారట. మంత్రులుగా బాధ్యతలు చేపట్టి మూడు నెలలే అవుతున్నా ఆ పెత్తనం వద్దంటున్నారు. అయితే వీరు రాజీనామా చేసేది చంద్రబాబు కోసమేనట. విశాఖ రాజధాని విషయంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ టీడీపీ నేత చంద్రబాబుకు సవాల్ విసిరాడు. దమ్ముంటే నాతో ఎన్నికల్లో బరిలోకి దిగు అంటూ ఛాలెంజ్ చేశాడు.

    మరో మంత్రి సీదరి అప్పల్రాజు సైతం తాను విశాఖ రాజధాని విషయంలో రాజీనామా చేస్తానని అంటున్నాడు. పలాస నుంచి చంద్రబాబును పోటీ చేయాలని సవాల్ విసురుతున్నాడు. అయితే మొదటిసారి ఎమ్మల్యేగా గెలిచిన అప్పల్రాజు ఇంతగా ఆవేశపడాల్సిన అవసరం లేదని కొందరు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరువలో ఉంటూ వారి బాగోగుల కోసం పోరాటం చేయాలే తప్ప పోకడలకు పోవద్దని కొందరు సలహాలు ఇస్తున్నారు.

    Also Read: సీఎం జగన్ కు మరో షాక్.. లిమిట్స్ అన్నీ దాటేశారంటూ సుప్రీంలో పిటిషన్..?

    శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అప్పల్రాజుపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలోని ఈ జిల్లాలో ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. సమస్యల గురించి పట్టించుకోకుండా సవాళ్లు విసరడమేంటని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. రాజధాని విషయంలో సవాళ్లు విసిరితే రచ్చ అవుతుందే తప్ప సమస్యలు పరిష్కారం కావంటున్నారు. ఇప్పటికే నేతల వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు సీరియస్ గా ఉంది. ఇలాంటి సమయంలో ఇరుకున పడితే రాజకీయంగా ఎదగడం కష్టమంటున్నారు.