Homeట్రెండింగ్ న్యూస్China Pork: పోర్క్ అంటే చచ్చేంత ఇష్టం: దానికోసం చైనా ఏమైనా చేస్తుంది

China Pork: పోర్క్ అంటే చచ్చేంత ఇష్టం: దానికోసం చైనా ఏమైనా చేస్తుంది

China Pork: ముక్క లేనిదే ముద్ద దిగని రోజులు ఇవి. చివరికి బ్రేక్ ఫాస్ట్ లో కూడా ముక్క ఉండాల్సిందే. ఇవీ నిన్నా మొన్నటి వరకు తెలంగాణలో పరిస్థితి పై నేషనల్ హెల్త్ సర్వే వెల్లడించిన విషయాలు. మన దగ్గర అయితే కోడి, యాటపోతు, చేపలు, రొయ్యలు, రకరకాల పిట్టల మాంసానికి డిమాండ్ ఉంటుంది. పోర్క్ కు కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ. మన దగ్గర పోర్క్ మినహా మిగతా మాంసాలు ఎంత క్రేజో… చైనాలో ఒక పోర్క్ మాత్రమే క్రేజ్. ఎంతలా అంటే కేవలం పందుల పెంపకానికి 26 అంతస్తుల కట్టేంత క్రేజ్.

China Pork
China Pork

పంది మాంసం అంటే ఇష్టం

చైనీయులు తెలుసు కదా.. కోవిడ్ తర్వాత వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో ప్రపంచం మొత్తం చూసింది. యాక్ తూ అని ముఖం మీద కాండ్రించి ఉమ్మింది. అయినప్పటికీ వారు మారలేదు. మారే అవకాశం లేదు..చాలా చోట్ల జీవించేందుకు తింటారు. కానీ చైనీయులు మాత్రం తినేందుకు మాత్రమే బతుకుతారు. అందుకే వారు ఆకాశంలో ఎగిరేవి, నీళ్లలో సంచరించేవి, భూమి మీద పాకేవి… సరిసృపాల నుంచి క్షీరదాల వరకు వేటిని కూడా వదిలిపెట్టరు. కానీ వీటిలో వారు బాగా లొట్టలు వేసుకుని తినేది పంది మాంసాన్ని. మొన్న జరిగిన జాతీయ కమ్యూనిస్టు పార్టీ సమావేశం సందర్భంగా కేవలం పంది మాంసం తోనే 50 రకాల వంటకాలు తయారు చేశారంటే వారికి దానిపై ఎంత మోజు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ చైనా అధ్యక్షుడు ఉదయం తాను చేసే బ్రేక్ ఫాస్ట్ మెనూలో తప్పనిసరిగా పంది మాంసం ఉండేలా చూసుకుంటాడు. చైనాలో రోజుకు కనీసం 50 నుంచి 100 టన్నుల పంది మాంసం తింటారని సమాచారం. ఎందుకంటే పంది మాంసంలో ఉన్న విటమిన్లు మరే దానిలో ఉండవని చైనా వాళ్ల నమ్మకం. అందుకే ఆ మాంసాన్ని మహా ఇష్టంగా తింటారు.

28 అంతస్తుల భవనం కట్టారు

పంది మాంసం వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో పొరుగున ఉన్న దేశాల నుంచి చైనా పందులను దిగుమతి చేసుకుంటున్నది.. ఇవి కూడా సరిపోకపోవడంతో త్వరగా ఎదిగే పంది జాతులను కనిపెట్టింది. వీటిని పెంచేందుకు ఏకంగా పెద్దపెద్ద బహుళ అంతస్తులు నిర్మిస్తోంది. తాజాగా హుబీ ప్రావిన్స్ లో ఎజవ్ పట్టణంలో ఏకంగా 26 అంతస్తుల భవనాన్ని నిర్మించింది. ఇందులో 12 లక్షల వరకు పందులను పెంచేందుకు ఏర్పాటు చేసింది. ఇందులో ప్రస్తుతం 6.5 లక్షల పందులు పెంచుతున్నారు.. గీనియా రకానికి చెందిన పంది మాంసాన్ని మహా ఇష్టంగా తినే చైనీయులు..

China Pork
China Pork

ఈ భవనంలో ఆ రకానికి చెందిన పందులను పెంచుతున్నారు. కోవిడ్ మళ్ళీ విజృంభిస్తున్న తరుణంలో పలు ఆంక్షలు విధిస్తున్న చైనా ప్రభుత్వం… పంది మాంసం విక్రయించే కేంద్రాలకు మాత్రం వెసులుబాటుల ఇవ్వడం గమనార్హం. పంది మాంసం శరీరానికి ఎంత మేలు చేసినప్పటికీ… మోతాదు ప్రకారమే తినాలని చైనా వైద్యులు చెబుతున్నారు. అది మించితే మాత్రం ముప్పు కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు. ప్రస్తుతం చైనాలో గుండెపోట్ల ద్వారా మరణిస్తున్న సంఖ్య పెరిగింది. దీనికి కారణం పరిమితి దాటి పంది మాంసాన్ని తినడమే. అలా తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు సంభవిస్తున్నది. వైద్యులు హెచ్చరించినప్పటికీ చైనా వాళ్ల తీరు మారడం లేదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular