Hop Shoots 1Kg Price: ప్రపంచంలో కొన్నింటికి విలువ ఎక్కువ. అవి పండ్లు కావచ్చు. కూరగాయలు కావచ్చు. కానీ వాటిని మనం కొనుగోల చేయలేం. దీంతో వాటి సాగుతో రైతులకు లాభాలు రావడం మాట అటుంచితే వాటిని సాగు చేసేందుకు భారీ మొత్తం ఖర్చవుతుందట. దీంతో వాటి సాగుకు ఎవరు మొగ్గు చూపడం లేదు. కానీ సాగు చేసిన వారికి మంచి ధర మాత్రం రావడం కామనే. గతంలో ఓ రకమైన మామిడి పండ్లకు కూడా రూ.లక్షల్లో ధర ఉన్న సంగతి విన్నాం. ఇప్పుడు కూరగాయల వంతు వచ్చింది. వీటి సాగు చేస్తే కిలో ధర రూ. 85,000 లు పలుకుతుందట. కానీ వీటిని పండించేందుకు కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడి కూడా పెట్టాల్సి వస్తోందట.

ఈ కూరగాయ పేరు హాప్ షూట్ దీన్ని హ్యూములస్ లుపులస్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయగా దీనికి పేరుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో హాప్ షూట్ ధర కేజీ రూ. లక్ష వరకు పలుకుతోంది. మొదట వీటిని ఉత్తర అమెరికా, యురేషియా, దక్షిణ అమెరికా వంటి దేశాల్లో మాత్రమే సాగుచేసేవారు. ఉష్ణమండల వాతావరణంలో ఇవి బాగా పండుతాయి. అందుకే వీటిని అక్కడే పండిస్తారు. వీటి పువ్వులతో అల్కహాల్ తయారు చేస్తారట. దీని ఆకులు బీరు తయారీలో ఉపయోగపడతాయి. అందుకే ఇంత భారీ ధర వీటికి ఉంటుందని చెబుతున్నారు.
ఒకప్పుడు మనదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లో కూడా వీటిని పండించేవారట. వీటికి ఎంత ధర పలుకుతుందో సాగుకు పెట్టుబడి కూడా అంతే మొత్తంలో ఖర్చవుతుంది. దీంతో వీటి సాగును మానేశారు. బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో ఓ రైతు వీటిని సాగు చేశాడు. వీటి ఆకులను కోయడం, పండించిన తరువాత కాయలను సేకరించడం చాలా శ్రమతో కూడుకుంటుంది. అందుకే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. అందుకే వీటి సాగును చేపట్టడం లేదు. హాప్ షూట్ కూరగాయలను పండించడం అంటే ఓ సవాలుగా మారింది.

హాప్ షూట్ కూరగాయలు అత్యంత ఖరీదైనవిగా గుర్తింపు పొందాయి. అల్కహాల్, బీరుల్లో ఉపయోగించడం వల్ల వీటికి ఇంత డిమాండ్ ఏర్పడింది. వీటి సాగుకు మొగ్గు చూపాలంటే చాలా ధైర్యం కావాలి. ఎంత దిగుబడి వస్తుందో అంతే మొత్తంలో పెట్టుబడి రూపంలో వెళ్లడంతో వీటిని సాగు చేయడం వృథా అనే ధోరణికి రైతులు రావడం గమనార్హం. అందుకే వీటి సాగుకు ముందుకు రావడం లేదు. వస్తే రైతులకు కూడా అంతగా లాభం రావడం లేదు. ఈ నేపథ్యంలో వీటి సాగు భారం కావడంతో రైతులు పట్టించుకోవడం లేదు.