RGV dislikes telugu heroes list: శివ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ… ఆ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. అప్పటిదాకా ఉన్న సినిమా సిస్టం మొత్తాన్ని మార్చేశాడు. ప్రేక్షకుడి యొక్క ఆలోచన దృష్టిని సైతం మార్చేసిన సినిమా శివ కావడం విశేషం. ఇక ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు అందులో కొన్ని సక్సెస్ సాధిస్తే మరికొన్ని ప్లాప్ లుగా మారాయి. ఏది ఏమైనా కూడా ఆర్జీవీ చిరంజీవి తో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో ఈ మూవీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక అప్పటినుంచి వర్మతో సినిమా చేయడానికి చిరంజీవి ఎప్పుడు ట్రై చేయలేదు. వర్మ సైతం చిరంజీవి మీద ఎప్పటికప్పుడు తన విషన్ని కక్కుతూ వచ్చాడు. ప్రతి విషయంలో చిరంజీవిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతుండడం అతనికి అలవాటైపోయింది. చిరంజీవి ఒక్కడినే కాదు ప్రతి ఒక్క హీరోని తను కామెంట్స్ చేస్తూ ఉంటాడు.
మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేస్తున్నప్పుడు అతని డాన్స్ చిన్న పిల్లాడు వేసే స్టెప్స్ లా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ ను చాలాసార్లు విమర్శించిన విషయం మనకు తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లను సైతం అతను వదిలిపెట్టలేదు. ఎప్పటికప్పుడు వాళ్ళను విమర్శిస్తూ ట్వీట్ వేస్తాడు.
Also Read: ‘ఆయా షేర్’ సాంగ్ హుక్ స్టెప్ కాపీ చేశారా..? నాని కంటే ఆయనే బాగా వేశాడుగా…వైరల్ వీడియో…
లేదంటే యూట్యూబ్ ద్వారా వీడియోలు పెడతాడు. దీనివల్ల ఆయా హీరోల అభిమానులను రెచ్చగొడుతూ ఉంటాడు. ఇక వర్మ ఎందుకు అలా చేస్తాడు అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే తను ఒక్కో టైం లో ఒక్కోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు.
కొన్నిసార్లు సినిమాలు చేయనని చెప్తాడు. ఇంకోసారి నేను మరో బ్లాక్ బాస్టర్ సినిమా చేస్తానని చెప్తాడు. అప్పుడే అలాగే ఒకరిని విమర్శిస్తాడు. కొద్దిసేపటికే వాళ్ళను పొగుడుతూ ట్వీట్ చేస్తాడు. ఇక సినిమాల విషయంలో సైతం వర్మ పూర్తిగా గాడి తప్పాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసే సినిమాలు ఏమాత్రం ప్రేక్షకులను అలరించడం లేదు…