Eesha Rebba: టూ మచ్ బాబోయ్… వరంగల్ అమ్మాయి ఈషా ఇంతకు తెగిస్తుందనుకోలా!

Eesha Rebba: చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. పరువాలతో వలవేసి మేకర్స్ ని ఆకర్షించాలి. లేదంటే పరిశ్రమ నుండి కనుమరుగై పోవాల్సి ఉంటుంది. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా అదే చేస్తుంది. ఇష్టం ఉన్నా లేకున్నా.. విమర్శలు ఎదురైనా స్కిన్ షో చేయక తప్పదు. అయితే అదేదో సిల్వర్ స్క్రీన్ మీద చేసే అవకాశం వస్తే పర్లేదు. ఈషా ఆఫ్ స్క్రీన్ లో తెగిస్తున్నారు. తాజాగా గోల్డ్ కలర్ షార్ట్ స్కర్ట్ ధరించి హాట్ […]

Written By: Shiva, Updated On : January 31, 2023 6:53 pm
Follow us on

Eesha Rebba: చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. పరువాలతో వలవేసి మేకర్స్ ని ఆకర్షించాలి. లేదంటే పరిశ్రమ నుండి కనుమరుగై పోవాల్సి ఉంటుంది. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా అదే చేస్తుంది. ఇష్టం ఉన్నా లేకున్నా.. విమర్శలు ఎదురైనా స్కిన్ షో చేయక తప్పదు. అయితే అదేదో సిల్వర్ స్క్రీన్ మీద చేసే అవకాశం వస్తే పర్లేదు. ఈషా ఆఫ్ స్క్రీన్ లో తెగిస్తున్నారు. తాజాగా గోల్డ్ కలర్ షార్ట్ స్కర్ట్ ధరించి హాట్ థైస్ చూపించింది. ఈషా పరువాల ధాటికి సోషల్ మీడియాలో భూకంపం వచ్చింది.

Eesha Rebba

ఈషా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. అభిమానులు తమదైన కామెంట్స్ చేస్తున్నారు. పరిశ్రమలో టాలెంట్ కి మించి లక్ పనిచేస్తుంది. దీనికి వందల ఉదాహరణలు చూపించొచ్చు. ఈషాకు ఆ లక్ తగలక వెనుకబడిపోయింది. అందం, అభినయం ఉండి కూడా ఓ స్థాయి హీరోయిన్ కాలేకపోయింది. ఆఫర్స్ వచ్చినా హిట్స్ పడినా బ్రేక్ రాలేదు. స్టార్ గా వెలిగే అదృష్టం దక్కలేదు.

Eesha Rebba

శేఖర్ కమ్ముల పరిచయం చేసిన హీరోయిన్స్ లో ఈషా రెబ్బా ఒకరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆ చిత్రం విడుదలై దశాబ్దం దాటిపోయింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పర్లేదు అనిపించుకుంది. ఆ మూవీలో నటించిన ఒక్క యాక్టర్ కూడా సక్సెస్ కాలేదు. అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో లీడ్ హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. ఆ చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అమీ తుమీ, ‘అ’ చిత్రాలు ఆమె నటించిన వాటిలో సక్సెస్ ఫుల్ చిత్రాలుగా ఉన్నాయి.

తెలుగు అమ్మాయి అనే అభిమానంతో దర్శకుడు త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో సెకండ్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు. ఏమాత్రం ప్రాధాన్యత లేని రోల్ కావడంతో స్టార్ హీరో మూవీలో నటించినా ఫేమ్ రాలేదు. రాగల 24 గంటల్లో మూవీలో మరోసారి లీడ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది. అది కూడా ఆమెకు నిరాశే మిగిల్చింది.

Eesha Rebba

తెలుగులో ఆమెకు లీడ్ హీరోయిన్ గా ఛాన్సులు రావడం కష్టమే. దీంతో ఇతర పరిశ్రమలపై దృష్టి పెట్టారు. మలయాళ, తమిళ భాషల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ లో నిరాదరణకు గురైన తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ లో ఎదిగారు. అంజలి, శ్రీదివ్య, బిందు మాధవి ఈ కోవలోకి వస్తారు. కాబట్టి తమిళంలో ఈషా సక్సెస్ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. మరి ఈషా రెబ్బా టాలెంట్ ని కనీసం తమిళ తంబీలై నా గుర్తిస్తారేమో చూడాలి.

Tags