ఉద్యోగుల్లో భారీగా పెరుగుతున్న ఒత్తిడి.. కారణాలు ఇవే..?

కరోనా వైరస్ విజృంభణకు ముందు, విజృంభణ తరువాత ఉద్యోగుల జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. గతంలో ఉద్యోగులు ఉద్యోగం చేయాలంటే ఆఫీస్ కు వెళ్లి అక్కడే పని చేయాల్సి ఉండేది. కొన్ని ప్రముఖ కంపెనీలు మినహా మిగిలిన కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చేవి కావు. ఉదయం ఆఫీసుకు రెడీ కావడం, సాయంత్రం పని ముగించుకుని ఇంటికి రావడం ఉద్యోగుల జీవితంలో భాగమై ఉండేది. అయితే కరోనా మహమ్మారి విజృంభణ వల్ల చిన్న […]

Written By: Kusuma Aggunna, Updated On : October 9, 2020 9:40 am
Follow us on

కరోనా వైరస్ విజృంభణకు ముందు, విజృంభణ తరువాత ఉద్యోగుల జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. గతంలో ఉద్యోగులు ఉద్యోగం చేయాలంటే ఆఫీస్ కు వెళ్లి అక్కడే పని చేయాల్సి ఉండేది. కొన్ని ప్రముఖ కంపెనీలు మినహా మిగిలిన కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చేవి కావు. ఉదయం ఆఫీసుకు రెడీ కావడం, సాయంత్రం పని ముగించుకుని ఇంటికి రావడం ఉద్యోగుల జీవితంలో భాగమై ఉండేది.

అయితే కరోనా మహమ్మారి విజృంభణ వల్ల చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ అనే తేడాల్లేకుండా అన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించాయి. అయితే ఇంటి నుంచి పని చేయడం వల్ల గతంతో పోలిస్తే ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిందని సోషల్ మీడియా సంస్థ లింక్డిన్ వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగుల్లో ఒత్తిడి అనే అంశంపై సర్వే నిర్వహించిన లింక్డిన్ సర్వే ద్వారా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ముఖ్యంలో పెళ్లైన మహిళలు ఇంట్లో పిల్లల వల్ల వర్క్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పురుషులు సైతం ఇంట్లో పని చేయడం ఇబ్బందికరంగా ఉందని, అనవసరంగా సమయం వృథా అవుతోందని.. ఇంటితో పోలిస్తే ఆఫీస్ లో పని చేయడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 25 శాతం మంది పురుషులు, మహిళలు ఇబ్బందులు ఎదురైనట్టు చెబుతుంటే 41 శాతం మంది ఒత్తిడి, ఆందోళన పెరిగినట్టు వెల్లడించారు.

వ్యక్తిగత జీవితానికి, పనికి వ్యత్యాసం లేకపోవడం ఒత్తిడికి కారణమవుతోందని వెల్లడించారు. మరోవైపు మహానగరాల్లో ఇప్పుడిప్పుడే కంపెనీలు ఓపెన్ అవుతున్నాయి. చాలా కంపెనీలు డిసెంబర్ నెల 31వ తేదీ వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఆప్షన్ ఇచ్చాయి. 2021 జనవరి నుంచి పూర్తిస్థాయిలో ఉద్యోగులు కంపెనీలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.