https://oktelugu.com/

టీడీపీ బలమే.. ఇప్పుడు బలహీనత అవుతోందా?

ఏ పార్టీలో కూడా కుల రాజకీయాలు కామన్‌. అందులోనూ టీడీపీలో అయితే కమ్మ సామాజిక వర్గానికి కేరాఫ్‌. ఆ పార్టీలో కమ్మ వారిదే హల్‌చల్‌. పార్టీ ఆవిర్భావం నుంచి మొన్నటివరకు చంద్రబాబు అధికారంలో ఉన్నంత సేపు పార్టీలో వారు చెప్పిందే వేదం. ఎన్టీఆర్‌‌ పార్టీని స్థాపించిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కమ్మ కమ్యూనిటీ వ్యాపించి సీట్లు సాధించింది. పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపింది. ఎక్కడెక్కడి నేతలు మరెక్కడో పోటీ చేసి విజయం సాధించారు. Also Read: ‘అదిరింది’ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 / 09:42 AM IST
    Follow us on


    ఏ పార్టీలో కూడా కుల రాజకీయాలు కామన్‌. అందులోనూ టీడీపీలో అయితే కమ్మ సామాజిక వర్గానికి కేరాఫ్‌. ఆ పార్టీలో కమ్మ వారిదే హల్‌చల్‌. పార్టీ ఆవిర్భావం నుంచి మొన్నటివరకు చంద్రబాబు అధికారంలో ఉన్నంత సేపు పార్టీలో వారు చెప్పిందే వేదం. ఎన్టీఆర్‌‌ పార్టీని స్థాపించిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కమ్మ కమ్యూనిటీ వ్యాపించి సీట్లు సాధించింది. పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపింది. ఎక్కడెక్కడి నేతలు మరెక్కడో పోటీ చేసి విజయం సాధించారు.

    Also Read: ‘అదిరింది’ షోపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు

    ఎక్కడో శ్రీకాకుళం జిల్లా చివ‌ర్లో ఇచ్చాపురం నుంచి కృష్ణారావు, విజ‌య‌నగ‌రం జిల్లా చీపురుప‌ల్లిలో గ‌ద్దె బాబూరావు, విశాఖ‌లో ఎంవీఎస్‌. మూర్తి, తూర్పుగోదావ‌రి జిల్లాలో బొడ్డు భాస్కర‌ రామారారావు, బుచ్చయ్య చౌద‌రి లాంటి వాళ్లు పాగా వేశారు. క‌మ్మ వ‌ర్గం ప్రాబల్యం లేని చోట్ల కూడా ఆ వ‌ర్గం నేత‌లు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇటు తెలంగాణ‌లోనూ నిజామాబాద్ లాంటి చోట్ల మండ‌వ వెంక‌టేశ్వర‌రావు, నేరెళ్ల ఆంజ‌నేయులు మంత్రులు అయ్యారు. వ‌రంగ‌ల్ లాంటి చోట్ల కూడా ఈ వ‌ర్గం వారు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. పార్టీ ప‌దేళ్లు ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు కూడా ఈ వ‌ర్గం టీడీపీనే పట్టుకొని ఉంది. ఇక సీమ‌లోనూ ప‌రిటాల‌, ప‌య్యావుల నుంచి క‌ర్నూలులో రాంభూపాల్ చౌద‌రి, మీనాక్షి నాయుడు, తిరుపతిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు, క‌డ‌ప‌లో క‌స్తూరి విశ్వనాథ‌నాయుడు ఇలా చాలా మంది క‌మ్మ నేత‌లు ఎక్కడిక్కడ ప‌రుచుకుపోయి రాజ‌కీయంగా బ‌ల‌మైన శ‌క్తులుగా మారిపోయారు. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కమ్మ వర్గం ఇప్పుడు దూరమవుతున్నట్లు తెలుస్తోంది.

    మొన్నటివరకు పార్టీని అంటిపెట్టుకొని ఉన్న కమ్మ వర్గం ఇప్పుడు ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎప్పుడూ లేనంత అభ‌ద్రతా భావంతో ఈ వ‌ర్గం నేత‌లు ఉన్నార‌న్నది స్పష్టంగా తెలుస్తోంది. త‌మ వ‌ర్గానికి భ‌విష్యత్తులో స‌రైన నేత లేడ‌న్న సందేహంతో కూడా చాలా మంది ఈ వ‌ర్గం నేత‌లు ఎవ‌రి దారి వారు వెతుక్కుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు టీడీపీకి గ‌త ఎన్నికల్లో కేవ‌లం 23 సీట్లు వ‌స్తే అందులో 11 మంది క‌మ్మలే ఉన్నారు. గెలిచిన ముగ్గురు ఎంపీల్లోనూ ఇద్దరు క‌మ్మ ఎంపీలే. క‌ర‌ణం బ‌ల‌రాం, వంశీ పార్టీ మారి చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇక మిగిలిన క‌మ్మ ఎమ్మెల్యేల్లో ప‌య్యావుల కేశ‌వ్‌, గొట్టిపాటి ర‌వి లాంటి వారిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఎంపీల్లో నాని, జ‌య‌దేవ్ ఇద్దరూ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ? తెలియ‌ని ప‌రిస్థితి.

    ఓవైపు చంద్రబాబు అధికారం కోల్పోవడం.. ఫ్యూచర్‌‌ లీడర్‌‌ ఎవరో తెలియక ఉండడంతో పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు పార్టీని నమ్ముకుని రాజకీయం చేయలేమన్న నిర్ణయానికి వచ్చారట. అందుకే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు ఎక్కడెక్కడో ఉన్న ఈ వ‌ర్గం నేత‌లు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గ‌ద్దె బాబూరావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి వార‌సుడు, ప్రముఖ పారిశ్రామిక‌వేత్త బోళ్ల రాజీవ్ సైతం పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారు. రాజీవ్ రేపో మాపో వైసీపీ కండువా క‌ప్పుకోనున్నారు. రాజ‌కీయ భ‌విష్యత్తు కావొచ్చు, పారిశ్రామిక అవ‌స‌రాల నేప‌థ్యం కావొచ్చు.. పార్టీ మారే వారి లిస్టులో ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు చెందిన క‌మ్మ నేత‌ల పేర్లు ఎక్కువ‌గానే తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

    Also Read: ‘తెలుగు’తోనే టీడీపీకి చెక్ పెట్టనున్న జగన్ సర్కార్?

    ఇక ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకే చెందిన మ‌రో మాజీ మంత్రి మాగంటి బాబు కూడా టీడీపీకి రాం రాం చెప్పబోతున్నారట. ఆయ‌న పార్టీ మార్పుకోసం స‌రైన ముహూర్తం కోసం చూస్తున్నారని తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో ఎన్నో యేళ్లుగా కీల‌క నేత‌గా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు చ‌ర్చలు జ‌రుపుతున్నార‌ని టాక్‌..? ఇక జ‌గ‌న్ సైతం కమ్మ వ‌ర్గంలో ఏ నేత ఊగిస‌లాట‌లో ఉన్నా వారిని వెంట‌నే పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యత‌ల‌ను సైతం త‌మ పార్టీలో ఉన్న అదే వ‌ర్గం నేత‌ల‌కు అప్పగించేశార‌ట‌. దీంతో వీరంతా త‌మ ఉనికి కోసం ఇప్పటి వ‌ర‌కు ఉన్న కులం ముసుగును తెంపేసుకుని టీడీపీతో బంధం వ‌దులుకుంటోన్న ప‌రిస్థితి. ఇన్నాళ్లు బ్యాక్‌ బోన్‌గా ఉండిపోయిన కమ్మ వర్గం ఇప్పుడు టీడీపీని వీడుతుండడంతో ఆ పార్టీలోని నేతల్లో అభద్రతా భావం పెరుగుతున్నట్లు తెలుస్తోంది.