MLA Pilot Rohit Reddy: మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ కేసులో కీలకంగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్వాతిముత్యం లో కమల్ హాసన్ టైప్ కాదు. ఆయన గురించి తరచి చూస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆయనను టార్గెట్ చేయడం వెనుక అనేక విషయాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.. బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి కలహాన్ రెడ్డికి రోహిత్ రెడ్డి సన్నిహితుడుగా పేరుంది.. ఎఫ్ ఐ ఆర్ లో రోహిత్ రెడ్డి పేరు లేకున్నప్పటికీ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. తర్వాత చార్జి షీట్ లో ఆయన పేరు నమోదు కావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.. ఇప్పుడు దీనిపైన బిజెపి విమర్శలు ఎక్కిపెట్టింది.. బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అయితే సిగ్గు, శరం ఉంటే తాను డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.. డ్రగ్స్ తీసుకొని అమ్మవారి వద్ద ప్రమాణం చేసేందుకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు.

దొంగ ఓటు వేశారా
వాస్తవానికి రోహిత్ రెడ్డి ఆర్థిక మూలాలు అంత బలంగా మారడానికి కారణం అతడు కొన్ని వివాదాస్పద పనులు చేయడమే. డ్రగ్స్, భూ దందాలో రోహిత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.. ఈయన అనుచరులు తాండూరు, పరిగి, కంది ప్రాంతాల్లో భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని అభియోగాలు ఉన్నాయి.. దీనిపై అప్పట్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు.. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్టు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు.. ఇక వికారాబాద్ జిల్లా సర్పన్ పల్లి రిసార్టులపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి.. ఇందులో రోహిత్ రెడ్డి ప్రమాదం ఉందని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ ఆరోపించడం గమనార్హం. తాండూరు విద్యా వికాస సమితి ట్రస్ట్ కు చెందిన భూమిని కూడా అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తోంది. దీనికోసం ఆయనకు కొంతమంది రెవెన్యూ అధికారులు సహకరించారని, ఇందులో కొంతమంది ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారని తెలుస్తోంది. అప్పట్లో ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసేందుకు రోహిత్ రెడ్డి విఫల ప్రయత్నం చేసినట్టు కూడా సమాచారం.

అఫిడవిట్ కూడా అంతేనా
2009లో తాండూరు నుంచి నామినేషన్ వేసిన రోహిత్ రెడ్డి తాను బీటీహెచ్ యూనివర్సిటీ స్వీడన్ లో చదువుకున్నట్టు పేర్కొన్నారు.. 2018 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం తన విద్యార్హత ఇంటర్ అని, నారాయణగూడ లో చదువుకున్నట్టు తెలిపారు.. అమెరికాలో శిక్షణ తీసుకొని, కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొందినట్టు పేర్కొన్నారు.. అయితే 2009 అఫిడవిట్లో విద్యార్హత 2018లో ఎందుకు మారిందని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాగా రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన వ్యవహార శైలి మరింత వివాదాస్పదమైంది. ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రస్తుతం బెంగళూరు డ్రగ్స్ కేసులో కల్హాసన్ రెడ్డి చెప్పిన వివరాల ఆధారంగానే రోహిత్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది.. అయితే ఈ కేసు కు సంబంధించి అన్ని దారులు మూసుకుపోతుండటంతో రోహిత్ రెడ్డి ఇప్పుడు మరింత చిక్కుల్లో పడ్డారు.