Mahesh Babu- Tabu: అందానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన హీరోయిన్స్ లో టబు ఒకరు. ఒడ్డు పొడుగు, చక్కని ఫేస్ కట్ కలిగిన టబు 90లలో సెక్సీ హీరోయిన్ గా వెలిగిపోయారు.ఇప్పటికీ ఆమె గ్లామర్ రోల్స్ చేస్తున్నారు. హిందీ హిట్ మూవీ అందాధున్ చిత్రంలో టబు నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ చేశారు. ఆ చిత్రంలో మెయిన్ విలన్ టబునే. కొన్ని బెడ్ రూమ్ సన్నివేశాల్లో కూడా నటించారు. ఐదు పదుల వయసు దాటేసినా టబు అంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఎవర్ గ్రీన్ గ్లామర్ టబు సొంతం.

కాగా అందాధున్ మూవీలో చేసిన తరహా పాత్ర మహేష్-త్రివిక్రమ్ మూవీలో చేస్తున్నారనేది లేటెస్ట్ టాక్. దర్శకుడు త్రివిక్రమ్ తన సినిమాల్లో నటులను రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ హిట్ అల వైకుంఠపురంలో నటించిన టబును మహేష్ చిత్రం కోసం తీసుకుంటున్నారట. అల వైకుంఠపురంలో చిత్రంలో అల్లు అర్జున్ తల్లి పాత్ర చేయగా మహేష్ మూవీలో ఆమె కోసం ఓ బోల్డ్ రోల్ రాశారట త్రివిక్రమ్.
కథలో కీలకమైన ఒక ఆంటీ పాత్ర ఆమె చేస్తుండగా మహేష్ పై మనసు పడుతుందట. అతనికి దగ్గర కావాలని ఆశపడే నెగిటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్ చేస్తున్నారనేది టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ ఒక షెడ్యూల్ జరిపి మధ్యలో ఆపారు. ఫస్ట్ షెడ్యూల్ అనంతరం స్క్రిప్ట్ లో మార్పులు చేశారని, పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మలిచారనే ఒక వాదన వినిపిస్తోంది. త్వరలో ఫ్రెష్ గా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.

ఇక మహేష్ వచ్చే ఏడాది ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రాజమౌళి సినిమా మొదలుపెట్టనున్నారు. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ అని రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. రాజమౌళి గత చిత్రాలకు మించి పాన్ వరల్డ్ మూవీగా భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. 2023 మే లేక జూన్ నెలలలో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కావచ్చని తెలుస్తుంది. మరి అదే జరిగితే త్రివిక్రమ్, రాజమౌళి చిత్రాలను ఏక కాలంలో మహేష్ పూర్తి చేయాల్సి ఉంటుంది.