https://oktelugu.com/

Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు.. ఏం జరుగుతోంది?

జపాన్‌లో ఈ ఏడాది రెండు భారీ భూకంపాలు సంభవించాయి. అక్కడ భూకంపాలు సాధారణమే. చాలా ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. ఏం జరిగిందని ఆరా తీయడం మొదలు పెట్టారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 4, 2024 / 08:29 AM IST

    Earthquake

    Follow us on

    Earthquake: దేశంలో ఒకవైపు ఫెంగల్‌ తుఫాన్‌ తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రభావం చూపుతోంది. వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఆలా తక్కువ. అందుకే ఇక్కడి ప్రజలు ధైర్యంగా ఉంటాయి. కానీ అప్పుడప్పుడు చిన్న పాటి ప్రకంపనలు వస్తుంటాయి. తాజాగా బుధవారం(డిసెంబర్‌ 4న) ఉదయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో జనం భయంలో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

    2 సెకన్లపాటు ప్రకంపనలు..
    తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో 2 సెన్లపాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లు, అపార్ట్‌మంట్ల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఏపీలోని విజయవాడలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. విశాఖపట్నం జిల్లాలోని అక్కయ్యపాలెంతోపాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇక తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భూమి కంపించింది. 2 సెన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. జగ్గయ్యపేట పట్టణంతోపాటు గ్రామాల్లో, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం జిల్లా చర్ల, చింతకాని, నాలుగవంచ మండలాల్లో భూమి కంపించింది. వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోనూ భూప్రకంపనలు రెప్పపాటులో సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని గిన్నెలు, సామగ్రి కిందపడ్డాయి.

    నిర్ధారించాల్సి ఉంది..
    తాజా ప్రకంపనలను అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. భూకంపమేనా.. అయతే భూకంప కేంద్రం ఎక్కడ ఉంది. రెక్టార్‌ స్కేల్‌పై ఎంత తీవ్రత నమోదైంది అనే వివరాలను అధికారికంగ ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ప్రజలు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. భూ కంప ప్రభావంపై ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.