https://oktelugu.com/

Rajasaab : రాజాసాబ్ సినిమా రిలీజ్ కి ఎందుకింత టైమ్ పడుతుంది…

తెలుగులో కమర్షియల్ సినిమాలను తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు మారుతి.

Written By:
  • Gopi
  • , Updated On : December 4, 2024 / 08:24 AM IST

    Rajasaab

    Follow us on

    Rajasaab : తెలుగులో కమర్షియల్ సినిమాలను తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు మారుతి… ఆయన చేయబోయే సినిమాల్లో చాలావరకు కమర్షియల్ సినిమాలే ఉంటాయి. మరి ఆయన ప్రభాస్ తో చేస్తున్న సినిమా కూడా కమర్షియల్ జానర్ లోనే తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాతో ఆయన సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా మంచి విజయాలను సాధిస్తున్న ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి ఆయన రేంజ్ అనేది మారిపోయింది. ఆయన ఫ్లాప్ సినిమాకి కూడా భారీగా కలెక్షన్స్ రావడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు అతనితో సినిమా చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఆయన నుంచి వచ్చే సినిమా భారీ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్లాలని ఉద్దేశ్యంతోనే ఆయన సినిమాలను ఎంచుకొని మరి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధించాలనే దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నాడు. ఇక తన అభిమానులను కూడా అలరించే విధంగా తన సినిమాలు ఉండాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన మారుతితో చేస్తున్న రాజాసాబ్ సినిమా పరిస్థితి ఎలా ఉంది. అసలు ఈ సినిమా షూట్ జరుపుకుంటుందా ఒకవేళ జరిగితే ఈ సినిమా ఎంత పర్సెంట్ షూట్ కంప్లీట్ చేసుకుంది లాంటి విషయాల మీద ఎలాంటి క్లారిటీ అయితే రావడం లేదు. అసలు ప్రభాస్ కి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయిం ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమా విషయంలో ఆయన ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాడనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అయితే మారుతి డైరెక్షన్ లో సినిమా చేయడం ఇష్టం లేకపోవడంతోనే ప్రభాస్ ఇలాంటి ఒక ధోరణితో ఉన్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

    మరి వీళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని మారుతి అనుకుంటున్నప్పటికి ఇది వర్కౌట్ అయ్యే విధంగా కనిపించడం లేదట. ఇక ఇంతకు ముందు రిలీజ్ అయిన ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది.

    మరి ఆ పోస్టర్ కూడా చంద్రముఖి సినిమాను తలపించేలా ఉండడంతో ఈ సినిమా చంద్రముఖి టైప్ ఆఫ్ స్టోరీ తోనే తెరకెక్కుతుంది అంటు ప్రతి ఒక్క అభిమాని కామెంట్స్ చేస్తున్నారు.

    దానివల్ల ఈ సినిమా మీద ఎక్కువగా బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు…ఇక ఈ సినిమా తర్వాత మారుతి ఎలాంటి సినిమాలు చేస్తాడనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ మాత్రం ఈ సినిమాకి అనవసరంగా కమిట్ అయ్యానా అనే ధోరణిలోనే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది…