Navratri Special: నోరూరిస్తున్న పానీ పూరీలు.. ఆకట్టుకుంటున్న దుర్గామాత మండపం.. ఎక్కడో తెలుసా?

దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని రోజుకో రూపంలో భక్తులు కొలుస్తున్నారు. గడిచిన ఐదు రోజుల్లో ఐదు రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

Written By: Sekhar Katiki, Updated On : October 19, 2023 5:14 pm

Navratri Special

Follow us on

Navratri Special: గణపతి నవరాత్రులు వచ్చాయంటే.. మండపాల్లో కొలువుదీరిన గణనాథుడిని వివిధ రూపాల్లో అలంకరిస్తారు. విగ్రహాల తయారీని కూడా భిన్నగా చేస్తారు. ఇక దేవీ నవరాత్రులు వచ్చాయంటే.. అమ్మవారిని తీరొక్క పూలతో కొలుస్తారు. రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారికి అలంకరణలు కూడా భిన్నంగా చేస్తారు. పుష్పార్చన చేస్తారు. కరెన్సీ నోట్లతో అలంకరిస్తారు. కూరగాయలతో అలంకరించి శాకాంబరిగా కొలుస్తారు. కానీ, ఇక్కడ అమ్మవారిని పానీ పూరీలతో అలంకరించారు. నోరూరిస్తున్న ఆ మండపం ఎక్కడుదో చూద్దాం రండి.

కోల్‌కతాలో వైభవంగా వేడుకలు..
దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని రోజుకో రూపంలో భక్తులు కొలుస్తున్నారు. గడిచిన ఐదు రోజుల్లో ఐదు రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అయితే కలకత్తా కాళి అంటే దేశ వ్యాప్తంగా ఎంత పేరుందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అటువంటి కోల్‌కతాలో దసరా ఉత్సవాల వేడుకలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. ప్రత్యేక అలంకరణలతో దుర్గామాత మందిరాలు వెలిగిపోతున్నాయి. ఏ మందిరం ప్రత్యేక దానిదే అన్నట్లుగా కొలువుతీరిన అమ్మవార్లు వెలుగొందుతున్నారు. కోల్‌కతా కళాకారులు దుర్గామాతలను వివిధ రూపాల్లో కళాకారులు రూపొందిస్తుంటారు. హైదరాబాద్‌లో గణనాధులు ఎంత వినూత్నంగా పలురూపాల్లో దర్శనమిస్తారో కోల్‌కతాలో దుర్గామాతలు అన్ని రూపాల్లో కనువిందు చేస్తుంటారు. కోల్‌కతాలో జరిగే దుర్గా పూజలలో భక్తుల సృజనాత్మకత కనిపిస్తుంటుంది.

బెహలాలో పానీపూరీ మండపం..
ఇక కోల్‌కతా నగరంలోని దక్షిణ శివారు బెహలాలోని ఒక దుర్గామండపాన్ని నిర్వాహకులు వినూత్నంగా డెకరేట్‌ చేశారు. ఈమందిరంలో అమ్మవారిని చూస్తే ఎంత భక్తిభావం కలుగుతుందో.. అక్కడి డెకరేషన్‌ చూస్తే అంతే నోరూరుతుంది. ఎందుకంటే దుర్గామాత మందిరాన్ని పానీపూరీలతో అలంకరించారు. ఈ మందిరంలో ఎక్కడ చూసినా పానీపూరీలే కనిపిస్తున్నాయి. అందుకే ఈ మందిరం అందంలో మాత్రమే కాదు రుచిలో కూడా పోటీ పడుతోంది. పానీపూరీలతో దుర్గామాత మందిరం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. బెహలా నోటున్‌ దాల్‌ క్లబ్‌ ఏర్పాటు చేసిన దుర్గా మండపం వీడియోను వ్యాపార దిగ్గజం హర్ష్‌ గోయంకా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ మండపాన్ని గోల్‌ గప్ప్‌ మందిరం అని పిలుస్తున్నారు. చాలామందికి ఇష్టమైన ఈ స్ట్రీట్‌ ఫుడ్‌తో దుర్గాపూజను ముడిపెట్టడం నిజంగా డిఫరెంట్‌ అంటున్నారు. మరి మీరు కూడా పానీపూరీలతో నోరూరిస్తున్న అమ్మవారి మండపంపై మీరూ ఓ లుక్కేయండి..