Animals Like Rain: వర్షాన్ని ఇష్టపడే జంతువులు ఏవో తెలుసా?

గొంగలి పురుగు వలె కనిపించే స్లగ్స్ వర్షకాలంలో ఎక్కువగా బయట కనిపిస్తాయి. ఎక్కువగా నీటితో నిండి ఉండే వీటి శరీరం పొడిబారినప్పుడు వర్షాకాలంలో చల్లదనం కోసం బయట సంచరిస్తూ ఉంటాయి. ఇవి వాటంతట అవే ముడుచుకుంటాయి.

Written By: Srinivas, Updated On : October 4, 2023 7:27 pm

Animals Like Rain

Follow us on

Animals Like Rain: వర్షాకాలం ప్రారంభ కాగానే చాలా మందికి భయం పుడుతుంది. ఆ సమయంలో ఏ జబ్బు వస్తుందోనని కంగారు పడుతుంటారు. కానీ వర్షంలో ఎంజాయ్ చేయాలని కొందరు అనుకుంటూ ఉంటారు. దీంతో కావాలనే వర్షంలో తడిసేవారు కూడా ఉన్నారు. అయితే మనుషులతో పాటు కొన్ని జంతువులకు వర్షంలో ఎంజాయ్ చేయాలని ఉంటాయి. దీంతో చినుకు పడగానే అవి బయటకు వచ్చి వర్షంలో తడుస్తాయి. వర్షంలో తడవడం వల్ల ఎంతో అనుభూతి చెందుతాయని జంతు నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతకీ వర్షం అంటే ఇష్టపడే జంతువులు ఏవో చూద్దాం..

కప్పలు:
వర్షకాలంలో ఒక వర్షం పడగానే కప్పల శబ్దాలు విపరీతంగా వినిపిస్తాయి. చాలా మంది వాటికి బాధ వేసి అరుస్తుందని అనుకుంటారు. కానీ అవి వర్షంలో ఎంజాయ్ చేస్తున్నట్లు లెక్క. వర్షాకాలంలో వానపాములు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కనిపిస్తే అవి లొట్టలేసుకొని తింటాయి. వీటి కోసం నీటిలో నుంచి బయటకువ వస్తాయి.

బల్లులు:
బల్లులను ఎక్కువగా ఇంట్లో కనిపిస్తాయి. కానీ వారనస్ జాతికి చెందిన బల్లులు వర్షంలో ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాయి. ఇవి ఎక్కవగా వర్షకాలంలోనే కనిపిస్తాయి.

పాములు:
పాములు ఎక్కువగా పుట్టల్లో జీవిస్తాయి. వర్షంలో అవి చల్లదనాన్ని పొందడానికి బయటకు వస్తాయి. అంతేకాకుండా వర్షకాలంలో కీటకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడానికి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి.

స్లగ్స్ :
గొంగలి పురుగు వలె కనిపించే స్లగ్స్ వర్షకాలంలో ఎక్కువగా బయట కనిపిస్తాయి. ఎక్కువగా నీటితో నిండి ఉండే వీటి శరీరం పొడిబారినప్పుడు వర్షాకాలంలో చల్లదనం కోసం బయట సంచరిస్తూ ఉంటాయి. ఇవి వాటంతట అవే ముడుచుకుంటాయి.

నత్తలు:
మృదువైన శరీరం ఉండే నత్తలు వర్షాకాలంలో ఎక్కువగా సంచరిస్తాయి. వాతావరణం చల్లగా ఉండడంతోనే ఇవి వృద్ధి చెందుతాయి. వర్షం అంటే వీటికి చాలా ఇష్టం.

నీటి గేదె:
నీటి గేదెలకు వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం.. సాధారణ కాలంలో ఇవి ఎక్కువగా నదులు, చెరువుల్లో ఉండడానికి ఇష్టపడుతాయి.

ఫిలిప్పీన్ డేగ:
ఫిలిప్పీన్ డేగ వర్షకాలంలో ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మగ డేగను ఆకర్షించడానికి జూలై నుంచి ఇది విన్యాసాలు చేస్తుంటుంది.

జలగలు:
ఎప్పుడూ నీటిలో ఉన్నా జలగలు వర్షాకాలంలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాయి. పర్వాతోరాహకులకు ఇవి ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి.

సాఫ్ట్ షెల్ తాబేలు:
భారతదేశంలో ఉండే తాబేళ్లు వర్షాకాలాన్ని ఎక్కువగా ఇష్టపడుతాయి. ఇవి ఈ కాలలో నీటిలో నుంచి బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తుంటాయి.