KIA Carens X Line: కార్ల వినియోగదారులను ఆకర్షించడానికి ప్రతీ కంపెనీ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తుంది. మిగతా ప్రొడక్ట్స్ కు పోటీ ఇస్తూ తన అమ్మకాలను పెంచుకుంటోంది. ఈ క్రమంలో అప్డేట్ ఫీచర్స్ తో పాటు తక్కువ ధరకు రిలీజ్ చేస్తుంది. దక్షిణ కొరియా కంపెనీ కియా తాజాగా న్యూ మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మార్కెల్లో ఉన్న టయోటా ఇన్నోవా, రూమియన్ ఆల్టర్నేటివ్ లకు పోటీ ఇస్తోంది. ఎస్ యూవీ సెగ్మెంట్లలో ఆకట్టుకుంటున్న ఈ కారు ఫీచర్స్, ధర ఎలా ఉన్నాయో చూద్దాం..
కియా కంపెనీ తాజాగా న్యూ మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనికి SUV Kia Carens X Line అని పేరు పెట్టింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లను కలిగిన ఇందులో 1.5 లీటర్ టర్బో ఇంజన్ ను అమర్చారు. 158 బీహెచ్ పి పవర్ ను అందిస్తోంది. డీజిల్ ఇంజిన్ వెరియంట్ లో 114 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 సీటర్ కలిగిన ఇందులో వినోదం కోసం వెనుక సీట్లలో స్క్రీన్లు ఉంటాయి. ఎస్ యూవీలో విశాలమైన కారును కొనుగోలు చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్ గా ఎంపిక చేసుకోవచ్చని అంటున్నారు.
SUV Kia Carens X Line ఎక్స్ షో రూం ధర రూ.18.95 లక్షలతో ప్రారంభం అవుతుంది. డీజిల్ వేరియంట్ రూ.19.44 లక్షల నుంచి ఉంది. ఇది కంపెనీ యొక్క ఎంపీవి కారు. అంటే మల్టీ పర్పస్ కోసం వినియోగించుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రయాణికులతో పాటు సరుకులను కూడా తీసుకెళ్లగల సామర్థం ఇందులో ఉంది. అంతేకాకుండా ఆకర్షనీయంగానూ ఉండడంతో దీని కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు.