https://oktelugu.com/

Shobha Shetty: బిగ్ బాస్ ఫేమ్ శోభ శెట్టి షాకింగ్ డెసిషన్… ఆందోళనలో ఫ్యాన్స్

హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శోభా ఎక్కువగా ఎక్కడా కనిపించలేదు. అయితే తాజాగా శోభా యాంకర్ గా మారిపోయినట్లు తెలుస్తుంది. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన శోభా కొంత కాలం సీరియల్స్ కి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించింది.

Written By:
  • NARESH
  • , Updated On : January 13, 2024 / 06:48 PM IST

    Shobha Shetty

    Follow us on

    Shobha Shetty: బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి ఇక సీరియల్స్ లో నటించదట. సీరియల్స్ మానేసి కెరీర్ ని కొత్తగా ప్రారంభించబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా శోభా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించింది. ఇంతకీ శోభా ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ కి వెళ్ళక ముందు కార్తీకదీపం సీరియల్ లో మోనిత గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక హౌస్లో అడుగుపెట్టిన శోభా తన ప్రవర్తనతో నెగిటివిటీ తెచ్చుకుంది. ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొంది.

    హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శోభా ఎక్కువగా ఎక్కడా కనిపించలేదు. అయితే తాజాగా శోభా యాంకర్ గా మారిపోయినట్లు తెలుస్తుంది. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన శోభా కొంత కాలం సీరియల్స్ కి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించింది. కాస్త భిన్నంగా ఉండే ప్రోగ్రాం లలో కనిపించాలి అనుకుంటున్నానని చెప్పించి. ఇప్పటికే మూడు ప్రోగ్రాములకు ఓకే చెప్పినట్లు వివరించింది. స్టార్ మా కు గుడ్ బై చెప్పేసి సుమన్ టీవీ లో ఎంటర్ అయింది శోభా శెట్టి.

    అయితే ఇందులో శోభా శెట్టి హోస్ట్ గా .. కాఫీ విత్ శోభా అనే ప్రోగ్రాం చేయబోతుంది. అయితే ఇప్పటి వరకు ఈ షో గురించి ఎలాంటి విషయాలు తెలియలేదు. అయితే తాజాగా శోభా తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ షో కి సంబంధించిన వివరాలు వివరించింది. కాఫీ విత్ శోభా చేసేందుకు ముందుగా ఓ ప్రోమోలో నటించింది. ఆ ప్రోమో త్వరలో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. మొదటి గెస్ట్ గా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ వచ్చాడు.

    అతను రావడం కాస్త ఆలస్యం అయింది. దీంతో సెకండ్ ఎపిసోడ్ షూట్ పూర్తి చేశారు. ఇక సెకండ్ ఎపిసోడ్ గెస్ట్ గా నటి విష్ణు ప్రియ వచ్చింది. అలా రెండో ఎపిసోడ్ షూట్ పూర్తి కాగా .. గౌతమ్ తో మొదటి ఎపిసోడ్ ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసింది శోభా. ఇక షో చూసేందుకు .. శోభా కోసం టేస్టీ తేజ కూడా అక్కడికి వచ్చాడు. షో షూటింగ్ చాలా సరదాగా సాగిపోయింది. అయితే సీరియల్స్ లో తన నటనతో ఆకట్టుకున్న శోభ నిర్ణయం ఫ్యాన్స్ కి ఒకింత షాక్ ఇస్తుంది.