Hanuman Sticker On Vehicles: మనం ప్రయాణం చేసే వాహనాలను జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే సుదూర ప్రయాణం చేసినప్పుడు అవి సురక్షితంగా ఉంటేనే మనకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందువల్ల బైక్ లేదా కారుకు సంబంధించిన రిపేర్లు ఏమైనా ఉన్నాయా? అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇదే సమయంలో కొందరు కారు లేదా వాహనం ఆకర్షణీయంగా కనిపించడానికి వాటిపై రకరకాల బొమ్మలు వేస్తుంటారు. ఎర్రటి క్లాత్ కలిగిన మెరుపులతో ఉండే కొన్ని దండలు వేస్తారు. మరికొందరు రకరకాల స్టిక్కర్లు వేస్తుంటారు. ఈ మధ్య ప్రతీ వాహనంపై ఉగ్రరూపంలో ఉన్న హనుమాన్ స్టిక్కర్ కనిపిస్తుంది. ఈ స్టిక్కర్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని దీనిని సృష్టికర్త చెబుతున్నారు. ఇంతకీ ఈ స్టిక్కర్ కథేంటి?
హనుమాన్ అనగానే మనకు బలవంతుడిగా చూస్తాం. అదే సమయంలో ఆయన సాహసాలు వింటూంటాం. కానీ ఆంజనేయుడికి కోపం వస్తే ఎలా ఉంటాడు? అనే విషయం మొన్నటి వరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ దేవుడిని నేరుగా ఎవరూ చూడలేరు. చిత్రాల ద్వారానే చూస్తుంటాం. అయితే ఉగ్రరూపమైన హనుమాన్ ను కూడా చిత్రీకరించాలని ఓ చిత్రకారుడి మనసులో తట్టింది. దీంతో కుంచెను పట్టుకున్న అతనికి ఓ రూపం కలిగింది. అదే ఉగ్రరూప హనుమాన్ చిత్రం.
కేరళకు చెందిన కరుణ ఆచార్య ఒక ఆర్టిస్టు. కాసరగోడ్ అనే గ్రామానికి చెందిన ఈయన ఒకసారి మంగుళూరుకు వెళ్లాడు. అక్కడ రకరకాల హనుమాన్ చిత్రాలను చూశాడు. కానీ అతినికి ఉగ్రరూపమైన హనుమాన్ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. దీంతో వెంటనే తన కుంచెకు పని చెప్పాడు. మెల్లగా తను అనుకున్న రూపాన్ని తీసుకొచ్చాడు. ముందుగా ఈ చిత్రాన్ని అతడు 2015లో దీనిని తయారు చేసి ఆ తరువాత గ్రాఫిక్ వర్క్ చేసిన తరువాత తన స్నేహితుడికి పంపాడు. ఆ తరువాత సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయి ప్రతి ఒక్కరూ డీప్ గా పెట్టుకున్నారు.
అయితే బడా కంపెనీ ఈ చిత్ర హక్కులు తమకు ఇవ్వాలని, భారీగా డబ్బు ఇస్తామని తెలిపింది. కానీ ఆచార్య కరుణ అందుకు ఒప్పుకోలేదు. దీనిని ప్రజలందరూ వాడుకోవచ్చని ఆయన అన్నారు. అయితే ఆయన గీసిన చిత్రానికి, ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రధాని మోదీ సంతోషించారు. ఈ మేరకు ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పడు ప్రతీ ఒక్కరూ ఈ స్టిక్కర్ ను వాహనాలపై వేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆయన చెబుతున్న ప్రకారం ఈ స్టిక్కర్ వాహనాలపై ఉంటే హనుమాన్ ప్రమాదాల నుంచి రక్షిస్తాడని అంటున్నాడు.