https://oktelugu.com/

Borrowers: అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడం లేదా? ఇలా చేయండి ..

డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అవసరానికి కంటే డబ్బు తక్కువగా ఉంటోంది. పైగా ఖర్చులు వీపరీతంగా పెరుగుతుండడంతో ఆదాయానికి మించిన వ్యయాలు ఎక్కువగా మారుతున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : August 5, 2023 / 02:32 PM IST

    Borrowers

    Follow us on

    Borrowers: ఈ రోజుల్లో ప్రతీ పనికి డబ్బు అవసరం. డబ్బు లేకపోతే జీవితం గడవదు. అయితే నగదు అవసరమైనంత ప్రతీ ఇంట్లో ఉండదు. దీంతో కొందరికి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అప్పులు చేయాల్సి వస్తుంది. తెలిసిన వాళ్ల దగ్గర లేదా బంధువుల దగ్గర అవసరమైనంత అప్పును తీసుకుంటాం. అయితే కొందరు డబ్బులు ఎవరికీ ఇవ్వకూడదు అన్న కఠిన నిర్ణయంతో ఇతరులకు ఇవ్వరు. మరికొందరు మాత్రం దయతో కూడిన మనసుతో, ఎదుటివాళ్లకు సాయం చేయాలన్న మనసుతో అడగ్గానే ఇచ్చేవాళ్లు ఉంటారు.అయితే ఇలా ఇచ్చిన వాళ్లే ఒక్కోసారి నష్టపోతుంటారు. అవసరానికి తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించడంలో కాస్త నిర్లక్ష్యం చేస్తారు. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే?

    డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అవసరానికి కంటే డబ్బు తక్కువగా ఉంటోంది. పైగా ఖర్చులు వీపరీతంగా పెరుగుతుండడంతో ఆదాయానికి మించిన వ్యయాలు ఎక్కువగా మారుతున్నాయి. దీంతో చాలా మంది ఇతరుల దగ్గర అప్పు తీసుకొని తమ అవసరాలు తీర్చుకుంటారు. అయితే ఇలా తీసుకున్న వాళ్లు తిరిగి సమయానికి చెల్లించేవారు ఒకరకమైతే.. ఎంత అడిగినా ఇవ్వని వారు మరో రకమైన వారు ఉంటారు. ఇందులో రెండోరకం వారు కాస్త మొండిగా ఉంటారు. వీరి దగ్గర నుంచి డబ్బులు రాకపోతే కొన్ని టిప్స్ పాటించాలి.. అవేంటంటే..

    ఒక్కోసారి మన దగ్గర తీసుకున్న డబ్బును మనకు రావాలంటే వారికి మనసు రాదు. ఎంత అడిగినా ఏదో కారణం చెబుతూ తప్పించుకుంటారు. పైగా తమ పరిస్తితి బాగా లేదని చెబుతూ ఉంటారు. పరిస్థితి బాగా లేనప్పుడు ఒక నిర్ణీత గడువు పెట్టి ఆ గడువులో మాట ఇచ్చిన ప్రకారం చెల్లించాలి. కానీ కొందరు ఇలా కూడా చెల్లించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారికి ఇతరులతో అడిగించాలి. అప్పు తీసుకున్న వాళ్లు ఎవరికైతే గౌరవం ఇస్తారో.. ఎవరికైతే అనిగిమనిగి ఉంటారో.. వారితో అడిగిస్తే కాస్త వసూలయ్యే అవకాశం ఉంటుంది.

    అయినా డబ్బులు ఇవ్వకపోతే ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఈ ఫిర్యాదు చేసే ముందు అప్పు తీసుకున్నట్లు ఆధారాలు ఉండాలి. అంటే ధ్రువీకరణ పత్రం లేదా.. ప్రామిసరి నోటు లాంటివి ఉండాలి. ప్రామిసరి నోటు కూడా కొంతకాలం మాత్రమే పనిచేస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఫిర్యాదు చేసినా డబ్బులు రాకపోతే ఇక లీగల్ గా కోర్టుకు వెళ్లొచ్చు. అయితే అప్పు చెల్లించాల్సిన వ్యక్తి వద్ద డబ్బులు ఉన్నా ఇవ్వకపోయిన సమయంలో మాత్రమే వెళ్లాలి. లేకుంటే తన దగ్గర పూర్తిగా లేనప్పుడు కోర్టు వారి పక్షాన వెళ్లే ఛాన్స్ ఉంది. అందువల్ల అప్పు ఇచ్చేటప్పుడు ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.