https://oktelugu.com/

Kothabangaru Lokam: కొత్త బంగారులోకం మూవీలో బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా?

Kothabangaru Lokam:‘కొత్త బంగారులోకం’. కాలేజీలో చేరిన కుర్రకారు తొలి పరిచయంలోనే ప్రేమలోపడి ఆ మాయలో పీకల్లోతు కూరుకుపోయి చివరకు తమ గోల్ సాధించాక కలుసుకున్న ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. కుర్రకారు మదిని గిలిగింతలు పెట్టేలా అందంగా ఈ ప్రేమకథను తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాకు మెయిన్ అసెట్ ‘పాటలు’. మిక్కీ జే మేయర్ సంగీతంలోంచి జాలువారిని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పొచ్చు. ప్రేమను, బాధను, విరహాన్ని కాలేజీ నేపథ్యాన్ని వివరిస్తూ సాగే […]

Written By: , Updated On : March 5, 2022 / 12:15 PM IST
mistake-in-movies

mistake-in-movies

Follow us on

Kothabangaru Lokam:‘కొత్త బంగారులోకం’. కాలేజీలో చేరిన కుర్రకారు తొలి పరిచయంలోనే ప్రేమలోపడి ఆ మాయలో పీకల్లోతు కూరుకుపోయి చివరకు తమ గోల్ సాధించాక కలుసుకున్న ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. కుర్రకారు మదిని గిలిగింతలు పెట్టేలా అందంగా ఈ ప్రేమకథను తీర్చిదిద్దారు.

Kothabangaru Lokam

Kothabangaru Lokam

ఇక ఈ సినిమాకు మెయిన్ అసెట్ ‘పాటలు’. మిక్కీ జే మేయర్ సంగీతంలోంచి జాలువారిని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పొచ్చు. ప్రేమను, బాధను, విరహాన్ని కాలేజీ నేపథ్యాన్ని వివరిస్తూ సాగే ఈ పాటలు అప్పట్లో ప్రతీకాలేజీలోనూ వినిపించాయి.

అయితే ‘కొత్త బంగారులోకం’ మూవీలో ఒక బ్లండర్ మిస్టేక్ ఉంది. అదేంటో తెలుసా.? ఇప్పటికీ దాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. ‘కొత్త బంగారులోకం’ మూవీలో అమ్మాయి ప్రేమలో నిండా మునిగి లేచిపోవడానికి రెడీ అయిన హీరో వరుణ్ సందేశ్ తన నాన్న సడెన్ గా చనిపోవడంతో అమ్మతో పాటు ఉండి చదువు పూర్తి చేస్తాడు. లేచిపోవడానికి వచ్చిన హీరోయిన్ ను వదిలేస్తాడు.

Also Read: బోల్డ్ బ్యూటీ పాయల్ ఛాన్సుల కోసం అలా చేసిందా?

అయితే చివర్లో క్లైమాక్స్ లో అమ్మాయి తండ్రి కనిపించి ఏం పూర్తి చేశావ్? ఎలా ఉన్నావ్ అని హీరో వరుణ్ ను అడిగితే ‘ఇంజినీరింగ్ అయిపోయింది అంకుల్’ అని సమాధానం ఇస్తాడు.

నిజానికి ఇంటర్ లో హీరో వరుణ్ చదివింది బైపీసీ. ల్యాబ్ లోనూ ప్రయోగాలు చేస్తూ కనిపిస్తాడు. కానీ చివరకు ఇంజినీరింగ్ పట్టా అందుకున్నట్టు క్లైమాక్స్ లో చూపిస్తారు. ఇదో పెద్ద మిస్టేక్. దానిపై ఇప్పటికీ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ‘బైపీసీ చదివి ఇంజినీర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు’ అంటూ మీమ్స్, ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. సినిమా తీసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే నెటిజన్లు ఆడుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: రేణుదేశాయ్ కు పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆస్తులెన్నీ?