HomeNewsTollywood Trending News: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trending News: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Tollywood Trending News: టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. మ్యాంగో జ్యూస్‌ బ్రాండ్‌ ఫ్రూటీకి ప్రముఖ హీరో రామ్‌ చరణ్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించినట్లు పార్లే అగ్రో ప్రకటించింది. ఇప్పటికే అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్ నటి ఆలియా భట్‌తో కలిసి రామ్‌ చరణ్‌ ఫ్రూటీని ప్రమోట్‌ చేయనున్నారు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, ఆలియా భట్‌ కలిసి నటించిన ‘ఆర్‌ఆర్ఆర్‌’ సైతం ఈ సీజన్‌లోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఫ్రూటీ చరణ్‌ను రంగంలోకి దింపింది.

Tollywood Trending News
Ramcharan as Brand Ambassador for Frooti

మరో అప్ డేట్ విషయానికి వస్తే..నాగ్ అశ్విన్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం కోసం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సాయం కోరారు. ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నామని, దీనికోసం భవిష్యత్ లో వాహనాలు ఎలా ఉంటాయో ఇందులో చూపించబోతున్నామని, అందుకోసం మహీంద్రా సంస్థకు చెందిన ఇంజినీర్ల సహాయం కావాలని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మహీంద్రా మీకు సాయపడే అవకాశాన్ని ఎలా కాదనుకుంటాం నాగ్ అశ్విన్?” అని బదులిచ్చారు.

Tollywood Trending News

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. ప్రపంచంలో సైంటిఫిక్‌గా ప్రూవ్‌ అయిన చాలా విషయాలను భారతదేశ పురాణాల్లో గతంలోనే చెప్పారు. అలాంటిదే అరుంధతి, వశిష్ట నక్షత్ర ప్రాముఖ్యత. సప్త ఋషి మండలంలో ఈ రెండు నక్షత్రాలే ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంటాయి. మన పురాణాల్లో ఇది ఎప్పుడో చెబితే ఆ తర్వాత సైంటిస్టులు వాస్తవమే అని తేల్చారు. రాధేశ్యామ్‌లో ప్రభాస్‌ మోడ్రన్‌ జ్యోతిష్యుడిగా కనిపించనుండగా, ఆ పాత్ర ద్వారా ఈ పాయింట్‌నే చెబుతున్నారట.

Tollywood Trending News
Prabhas

Also Read: హీరోయిన్ కి అసభ్యకర మెసేజ్​లు.. ప్రముఖ వ్యక్తి కుమారుడు అరెస్ట్​

అలాగే ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. తెలుగులో బంపర్‌ హిట్‌ కొట్టిన భీమ్లా నాయక్‌ ఇక హిందీలో విడుదలకు సిద్ధమైంది. నేడు హిందీ వర్షన్‌ ట్రైలర్‌ విడుదల కాగా, తెలుగు డైలాగులకు హిందీ డైలాగులు కూడా సరిగ్గా సరిపోయాయి. తెలుగు ట్రైలర్‌లోని ఇంటెన్సిటీ హిందీలోనూ కొనసాగించారు. ఇంకా విడుదల తేదీని ఖరారు చేయలేదు. అయితే మార్చ్‌ 11న విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు అక్కడి చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి హిందీలో భీమ్లా రాణిస్తాడా చూడాలి.

Tollywood Trending News
Bheemla Nayak in Hindi

Also Read: రాధేశ్యామ్ టాక్ లీక్.. ఎలా ఉందంటే?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version