
Delhi Liquor Scam- Bandi Sanjay: తెలంగాణలో మహిళలపై వివక్ష ఏస్థాయిలో ఉంది. పాలకులకు మహిళలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది.. చివరకు అధికారంలో ఉన్న మహిళా నేతలు సాటి మహిళలకు ఏపాటి విలువ ఇస్తున్నారు అన్న విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత విషయంలో బట్టబయలైంది. కవిత తెలంగాణ రాజకీయాలను శాసించే స్థాయిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు కావడంతో ఆమె తప్పు చేసినా రైటే అంటున్నారు. తెలంగాణ ప్రథమ పౌరురాలు ఏ తప్పు చేయకున్నా.. ఆమెను కించపరుస్తున్నారు. అవమానిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా కల్పించాల్సిన ప్రొటోకాల్ కూడా లేకుండా చేస్తున్నారు. ఈ సమయంలో అధికార బీఆర్‌ఎస్ మహిళా నేతలుగానీ, మహిళా మంత్రులు గానీ, మహిళా ఎమ్మెల్యేలు గానీ, మహిళా ఎంపీలు గానీ నోరు మెదపలేదు. సారా దందాలో అవినీతికి పాల్పడి మహిళా సమాజం తల దించుకునే పనిచేసిన కేసీఆర్ బిడ్డ కోసం నాడు నోరు మూసుకున్న నేతలు ఇప్పుడు రోడ్లెక్కుతున్నారు. మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు. తాము పథకాలు ఇస్తున్నాం కాబట్టి తాము చేసిందే కరెక్టు అనుకునే కల్వకుంట్ల ఫ్యామిలీ అండ్ కో తీరును నేడు తెలంగాణ మహిళా సమాజం గమనిస్తోంది.
కౌషిక్‌రెడ్డి బూతు పదం వాడినా..
తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌషిక్‌రెడ్డి ఇటీవల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రెస్‌మీట్ పెట్టి రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ తమిళిసై గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బూతు పదం వాడారు. ఆయన వాడిన భాష చూసి తెలంగాణ మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుంది. ఎమ్మెలీస అయి ఉండి ఇలాంటి భాష వాడడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ, అధికార పార్టీ బీఆర్‌ఎస్ నుంచి ఒక్క మహిళా నేత కూడా కౌషిక్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించలేదు. తప్పు అని చెప్పలేదు. క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడుగానీ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గానీ సూచించలేదు. చివరకు జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా నోటీసులు ఇచ్చింది. ఎక్కడో ఢిల్లీలో ఉన్న మహిళా కమిషన్ గుర్తించిన కౌషిక్‌రెడ్డి వ్యాఖ్యలను స్థానిక బీఆర్‌ఎస్ నేతలు, మహిళా నేతలు గుర్తించకపోవడం సిగ్గుచేటు.
బండి వ్యాఖ్యలపై ఎగిరెగిరి పడుతున్నారు..
మహిళా సమాజం తలదించుకునే పనిచేసి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విచారణకు వెళ్లిన కేసీఆర్ ముద్దుత బిడ్డ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెల్లి గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసభ్యకరంగా మాట్లాడారని బీఆర్‌ఎస్ నేతలు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గవర్నర్‌పై తమ పార్టీ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు లేవని నోళ్లన్నీ ఇప్పుడు లేస్తున్నాయి. కేటీఆర్ భాషలో చెప్పాలంటే ఎగిరెగిరి పడుతున్నారు. మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా తప్పే. సంజయ్ కరెక్టే మాట్లాడారని ఎవరూ అనడం లేదు. కానీ అధికార మదంతో కౌషిక్‌రెడ్డి అంతకన్నా బూతు పదం వాడినా ఎందుకు ఖండించలేదు. నోళ్లు ఎందుకు తెరువలేదు. గవర్నర్ కూడా మహిళే కదా. తమిళిసైకి అయితే ఒక న్యాయం.. కవితకు అయితే ఒక న్యాయమా. అలాటప్పుడు మహిళా తత్వం ఎక్కడ ఉన్నట్లు..

తెలంగాణ మహిళా సమాజమా ఆలోచించు. తమ నేత బిడ్డకు ఒక రీతిన.. తమకు కాని మహిళ పట్ట ఒక రీతిన వ్యవహిస్తున్న అధికార బీఆర్‌ఎస్ పార్టీ మహిళా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తీరును గమనించు. ఇందుకేనా మనం వీళ్లన గెలిపించింది. ఇందుకేనా వీరికి అధికారం అప్పగించింది. దొంగలకు కాపుకాయడానికేనా వీరిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నాం. తెలంగాణ మహిళా సమాజమా సిగ్గుపడు. వీరు మన మహిళా మంత్రులు అయినందుకు, వీరు మన మహిళా ఎమ్మెల్యేలు అయినందుకు, వీరు మన మహిళా ఎంపీలు అయినందుకు.