
Empty Stomach: మనం రాత్రి డిన్నర్ తీసుకున్నాక ఇక నిద్ర పోవడమే. రాత్రంతా కడుపు ఖాళీగా ఉంటుంది. కనీసం మంచినీళ్లు కూడా తాగం. ఖాళీ కడుపుతో ఉంటాం. దీని వల్ల లోపల క్లీనింగ్ బాగా జరుగుతుంది. మనం తిన్న ఆహారాలు రాత్రంతా జీర్ణం అవుతుంది. ఇక లేచే సరికి ఖాళీ కడుపు దర్శనమిస్తుంది. ఇక లేడికి లేచిందే పరుగు అని కొందరు ఏవేవో పడేస్తుంటారు. కాఫీ, టీ లనుంచి మొదలు పెడితే పొద్దస్తమానం ఆడించడమే. దీంతో మన ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుంది.
మనిషి ఇరవై నాలుగు గంటలు తినడం కాదు. కాస్త విశ్రాంతి ఇవ్వాలి. మనం తిన్నది అరగడానికి సమయం ఇవ్వాలి. అంతేకాని ఒకదాని వెంట మరొకటి పడేస్తే కడుపు కీకారణ్యంగా మారుతుంది. కాలేయం నిరంతరం పనిచేయాల్సి వస్తుంది. దీంతో దానికి విశ్రాంతి ఇవ్వకపోవడంతో కొంత కాలానికి చేతులెత్తేస్తుంది. ఇక నా వల్ల కాదు మొర్రో అని మొరాయిస్తుంది. ఫలితంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఒక నియమ నిష్టల ప్రకారం ఆహారం తీసుకోవడం ఉత్తమం.
ఉదయం లేవగానే పరగడుపున ఓ లీటరు పావు నీళ్లు తాగాలి. దీంతో మన లోపల ఉన్న మలినాలు బయటకు వచ్చే అవకాశముంటుంది. దీంతో మన కడుపులో ఇంకా ఏదైనా చెత్త ఉంటే దాన్ని బయటకు ఊడ్చేస్తుంది. దీని వల్ల కడుపు క్లీన్ గా అవుతుంది. ఓ అరగంట తరువాత మళ్లీ ఓ లీటరు పావు నీళ్లు తాగితే ఇక కడుపులో చిన్నచిన్న రేణువులు సైతం బయటకు రావడం ఖాయం.

ఎప్పుడు కూడా ఉదయం పరగడుపున అరటిపండు తినొద్దు. ఇందులో ఉండే మెగ్నిషియం, కాల్షియం స్థాయిలు పెరిగి మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇంకా కాఫీ, టీలు వంటివి కూడా తాగకూడదు. కారంతో చేసిన పదార్థాలు తీసుకున్నా శరీరంలో యాసిడ్ స్థాయిపై ప్రభావం పడుతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇన్ని రకాల నష్టాలు ఉన్నందున ఉదయం పూట ఏం తినకూడదు. మంచినీళ్లు మాత్రమే తాగాలని గమనించుకోవాలి.