Rajamouli Son Karthikeya: రాజమౌళి-రమా లది అన్యోన్య దాంపత్యం, వృత్తిపరంగా వ్యక్తిగతంగా పార్టనర్స్. రాజమౌళి సినిమాలకు రమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తారు. వీరిది సాధారణ బంధం కాదు. వీరి పెళ్లి, పిల్లలు వంటి విషయాల్లో అనేక లోతులు ఉన్నాయి. పెళ్ళై విడాకులు తీసుకున్న రమాను రాజమౌళి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కీరవాణికి రమా మరదలు అవుతుంది. దాంతో రాజమౌళికి రమాతో ఎప్పటి నుండో పరిచయం ఉంది. ఆయన కెరీర్లో ఎదగక ముందు రమాను ప్రేమించారు. అప్పటికే రమాకు కార్తికేయ కొడుకుగా ఉన్నాడు.
రాజమౌళి ప్రేమ ముందు రమాకు పెళ్లైంది, కొడుకు ఉన్నాడు అనే విషయాలు చిన్నగా అనిపించాయి. పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పి నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. పెళ్ళికి ముందు జరిగిన కొన్ని సంఘటనలను కొడుకు కార్తికేయ పంచుకున్నారు. తల్లి రమాకు రాజమౌళితో వివాహం అయ్యే నాటికి కార్తికేయ పిల్లాడిగా ఉన్నాడు. అయితే పరిస్థితులను అర్థం చేసుకునే వయసు ఉంది.
తాజా ఇంటర్వ్యూలో కార్తికేయ మాట్లాడుతూ… అమ్మతో బాబా(రాజమోళి)కి పెళ్లి అనుకోకముందే రోజు ఆయన ఇంటికి వచ్చేవారు. అమ్మను నన్ను డిన్నర్ కి తీసుకెళ్లేవారు. అప్పుడే నేను అనుకున్నాను. బాబా అమ్మను వివాహం చేసుకుంటారని, అన్నారు. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారని, రమా పట్ల రాజమౌళి అఫెక్షన్ చూపించేవారని కార్తికేయ మాటలతో అర్థం అవుతుంది.
కార్తికేయను దృష్టిలో ఉంచుకొని రాజమౌళి పిల్లల్ని కనలేదు. తనకంటూ బిడ్డలు వద్దని ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే అబ్బాయితో పాటు ఒక అమ్మాయి కూడా కావాలనుకొని దత్తత తీసుకున్నారు. కూతురు పేరు మయూఖ. ఆమె కూడా రాజమౌళికి సొంత కూతురు కాదు. రాజమౌళి పిల్లలుగా ఉన్న కార్తికేయ రమా మొదటి భర్త సంతానం కాగా, మయూఖ దత్తత తీసుకున్న అమ్మాయి. రాజమౌళి ఆదర్శాలకు ఆయన కుటుంబం నిలువెత్తు నిదర్శనం.
ప్రస్తుతం కార్తికేయ రాజమౌళికి రైట్ హ్యాండ్ అయ్యాడు. ఆయన సినిమాలకు సంబంధించిన అనేక విషయాలు కార్తికేయ చక్కబెడతాడు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలవడంలో కార్తికేయ పాత్ర ఎంతగానో ఉంది. ఆస్కార్ సభ్యులకు ఆర్ ఆర్ ఆర్ మూవీ చేరేలా అవసరమైన క్యాంపైన్స్ నిర్వహించారు.