
Mrunal Thakur: సీతారామం మూవీలో మృణాల్ ఠాకూర్ ని చూసిన ప్రేక్షకులు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చూసి అవాక్కవుతున్నారు. బికినీలు, పొట్టిబట్టలో మంటలు రేపుతున్నారు. మృణాల్ నుండి ఈ రేంజ్ స్కిన్ షో ఊహించలేదని జనాలు వాపోతున్నారు. తాజాగా మృణాల్ ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. హాట్ క్లీవేజ్ షోతో కేక పుట్టించారు. చిన్న హుక్ మీద ఆధారపడ్డ మృణాల్ జాకెట్ చూసి… ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఆ ఒక్కటి కూడా ఊడితే పరిస్థితి ఏంటన్న సందేహం వ్యక్తపరుస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. గత ఏడాది సీతారామం మూవీతో మృణాల్ టాలీవుడ్ లో అడుగుపెట్టారు. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ మెస్మరైజ్ చేసింది. సీతారామం మృణాల్ కి తెలుగులో విపరీతమైన ఫేమ్ తెచ్చిపెట్టింది.
నెక్స్ట్ ఆమె నానికి జంటగా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన కూడా జరిగింది. నాని 30వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. ఆ మధ్య టాప్ స్టార్స్ మహేష్, పవన్, ఎన్టీఆర్ పక్కన అవకాశాలు వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఆమె బాలీవుడ్ లో బిజీగా గడుపుతున్నారు.

నాలుగైదు హిందీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. మృణాల్ కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. కెరీర్ బిగినింగ్ లో అనేక కష్టాలు పడ్డట్లు మృణాల్ గతంలో చెప్పుకొచ్చారు. తనను మట్కా(కుండ) అని ఎగతాళి చేసేవారట. సీరియల్ యాక్టర్ అంటే చిన్నచూపు చూసేవారట. సల్మాన్ మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేసి తర్వాత తీసేశారని మృణాల్ ఓ సందర్భంలో చెప్పారు.
పెళ్లి విషయంలో మృణాల్ చేసిన కామెంట్స్ ఆ మధ్య సంచలనం రేపాయి. జీవితంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఆమె చెప్పారు. థర్టీ ప్లస్ లో ప్రేమ, పెళ్లి వంటి వ్యవహారాలు ఒత్తిడికి గురి చేస్తాయి. అందుకే వాటి జోలికి పోను. కానీ పిల్లలను కనాలని ఉంది. ఈ రోజుల్లో తల్లి కావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు…