https://oktelugu.com/

Nita Ambani Makeup Man Salary: కంపెనీ సీఈవో కంటే నీతూ అంబానీ మేకప్ మెన్ సాలరీ ఎక్కువ.. ఎంతో తెలుసా?

నీతూ అంబానీ ముఖేష్ సతీమణి గానే కాకుండా పలు కార్యక్రమాల్లో అలరిస్తూ ఉంటారు. భర్తతో పాటు రియలన్స్ కు సలహాదారుగా ఉంటూనే కొన్ని స్పెషల్ ఈవెంట్లలో దర్శనమిస్తారు.

Written By: , Updated On : May 10, 2023 / 12:18 PM IST
Follow us on

Nita Ambani Makeup Man Salary: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తరువాత మూడు తరాల వారు తిన్నా తరగని ఆస్తిని సంపాదించాడు. మార్కెట్లో కొత్త కొత్త వస్తుసేవలను అందుబాటులోకి తీసుకొస్తూ.. కొన్నింటిని తక్కువ ధరకే అందిస్తున్నముఖేష్ ప్రపంచ ధనవంతుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. అయితే లెక్కలేనంత డబ్బు ఉన్న ఆయన జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా లగ్జరీ లైఫ్ ను మెయింటేన్ చేస్తారు. ముఖ్యంగా ముఖేష్ సతీమణి నీతూ అంబానీ లైఫ్ మరింత రిచ్ గా ఉంటుందని ఇప్పటికే పలు వార్తలు, కథనాలు బయటకు వచ్చాయి. లేటేస్టుగా ఆమె మేకప్ మెన్ గురించి హాట్ టాపిక్ గా మారింది. నీతూ అంబానీ మేకప్ మెన్ కు ఇచ్చే జీతం ఓ కంపెనీ సీఈవో కంటే ఎక్కువగా ఉంటుందని తెలియడంతో అంతా షాక్ తింటున్నారు.

నీతూ అంబానీ ముఖేష్ సతీమణి గానే కాకుండా పలు కార్యక్రమాల్లో అలరిస్తూ ఉంటారు. భర్తతో పాటు రియలన్స్ కు సలహాదారుగా ఉంటూనే కొన్ని స్పెషల్ ఈవెంట్లలో దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఆమెను చూసిన వారు హీరోయిన్ రేంజ్ లో ఉందంటూ కొనియాడుతారు. అయితే నీతూ అంబానీ అందం విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉంటారు. తాను ముగ్గురు పిల్లల తల్లి అయినా ఇంకా యవ్వనంగా ఉండేలా ఆరోగ్య నియమాలు పాటిస్తారు. ఇదే సమయంలో మేకప్ కోసం కూడా ప్రత్యేక బడ్జెట్ ను కేటాయిస్తారట.

నీతూ అంబానీకి మేకప్ వేసేది మిక్కీ కాంట్రాక్టర్. ఈయన చూడ్డానికి పెద్దమనిషిలా కనిపిస్తాడు. కానీ ఆయన మేకప్ తో ఎలాంటి వారినైనా అందంగా తయారు చేస్తారు. అందుకే ఆయనకు డిమాండ్ ఎక్కువ. మిక్కీ కాంట్రాక్టర్ గతంలో బాలీవుడ్ హీరోయిన్లకు మేకప్ మెన్ గా ఉండేవారు. ఆయన హమ్ ఆప్కే హై కౌన్, దిల్ టు పాగల్ హౌ, కుచ్ కుచ్ హోతా హౌ, కభీ ఖుషీ కభీ గమ్, తదితర సినిమాలోని ఆర్టిస్టులకు మేకప్ వేశారు. అలాగే ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్, ఆశాబోంస్లే లకు మేకప్ మెన్ గా పనిచేశారు.

అందుకే ఆయనను నీతూ అంబానీ ప్రత్యేకంగా నియమించుకున్నారు. అయితే డిమాండ్ విపరీతంగా ఉన్న మిక్కీ మేకప్ వేసినందుకు తక్కవేం తీసుకోరు. ఒక్కోసారి మేకప్ బ్రష్ పడితే రూ.లక్ష ఖర్చవుతుంది. కొంత మంది ఉన్నత వర్గానికి చెందిన మహిళలు లక్షలు పోసి ఈయనతో మేకప్ వేసుకుంటున్నారట. నీతూ అంబానీకి కూడా మేకప్ వేసినందుకు ఆయనకు రోజుకు రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు ఇచ్చేవారట. అయితే ఇది కొన్ని సంవత్సరాల కిందటి బడ్జెట్. ఇప్పుడు ఆయనకు డబుల్ పేమేంట్ చెల్లిస్తున్నట్లు సమాచారం.

ఒక కంపెనీ కీ సీఈవో అయితే మహా అయితే నెలకు కోటి రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతారు. కానీ మిక్కి కాంట్రాక్టర్ నెలలో కనీసం 15 రోజులు మేకప్ వేసినా ఎన్ని కోట్లవుతాయో మీరే ఊహించుకోండి. ఇన్ని కోట్లు సంపాదిస్తున్న ఆయన గురించి ఎప్పుడూ బయటకు రాలేదు. పైగా మిక్కి హడావుడి కూడా చేయడు. అయితే ఇటీవల ఆయన గురించి తెగ చర్చించుకుంటున్నారు. దీంతో ఆయన ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి.