
Bichagadu 2: ఏ భాషకి సంబంధించిన హీరో సినిమాని అయినా కంటెంట్ బాగుంటే నెత్తిన పెట్టుకొని ఆరాధించే ఇండస్ట్రీ ఇండియా లో ఏదైనా ఉందా అంటే అది టాలీవుడ్ మాత్రమేనని గర్వంగా చెప్పుకోవచ్చు.దానికి రీసెంట్ ఉదాహరణ ‘కాంతారా’ అయితే అప్పట్లో ‘బిచ్చగాడు’ సినిమా.తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది.బాక్స్ ఆఫీస్ దగ్గర నుండి టీఆర్ఫీ రేటింగ్స్ వరకు ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి పోటీ గా అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా విడుదలైంది.ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల క్లోసింగ్ కలెక్షన్స్ 21 కోట్ల రూపాయిలైతే ,బిచ్చగాడు మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ దాదాపుగా 27 కోట్ల రూపాయిల వరకు వచ్చాయి.టాలీవుడ్ ఆడియన్స్ కి అసలు పరిచయమే లేని హీరో కి తెలుగు సూపర్ స్టార్ సినిమాకి మించిన వసూళ్లు ఇచ్చారంటే మన ఆడియన్స్ ఎంత గొప్పవాల్లో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ చేస్తున్నారు, ఈ సీక్వెల్ కి సంబంధించి ఇప్పటికే ప్రొమోషన్స్ ప్రారంభం అయ్యాయి,మొదటి సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..రేపు ఈ సినిమాకి సంబంధించి నాలుగు నిమిషాల ఓపెనింగ్ సన్నివేశాన్ని విడుదల చేయబోతున్నట్టు మూవీ టీం నేడు అధికారికంగా తెలిపింది..ఇదంతా కాసేపు పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు లో ఒక రేంజ్ లో జరగబోతుందని తెలుస్తుంది.మన తెలుగు ఆడియన్స్ సీక్వెల్స్ కి బ్రహ్మరథం పడుతున్నారు, అందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

అందుకే ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం తెలుగు వెర్షన్ 50 కోట్ల రూపాయిలు అడుగుతున్నారట.బిచ్చగాడు చిత్రానికి ఉన్న క్రేజ్ ని చూసి బయ్యర్స్ అంత పెట్టడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదట..ఇక రేపు విడుదల చెయ్యబొయ్యే 5 నిమిషాల సన్నివేశం ప్రేక్షకులను ఆకర్షిస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.