
Bhola Shankar: ఈ ఏడాది ప్రారంభం లోనే ‘వాల్తేరు వీరయ్య’ లాంటి గ్రాండ్ సక్సెస్ ని అందుకొని మంచి జోష్ మీదున్న మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ చేస్తున్నాడు అనే సంగతి తెలిసిందే..తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా అజిత్ ‘వేదలమ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.హైదరాబాద్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో రెండు వందల మంది డ్యాన్సర్స్ తో ఒక పాటని చిత్రీకరిస్తున్నారు.
అయితే ఈ సినిమాని ఆగస్టు 11 వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం.పేరు కి ఈ సినిమా రీమేక్ అయ్యినప్పటికీ తెలుగు నేటివిటీ కి తగ్గట్టు గా మెగాస్టార్ నుండి అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడట డైరెక్టర్ మెహర్ రమేష్.ప్రతీ సన్నివేశానికి చిరంజీవి ఇచ్చే ఇన్ పుట్స్ ని తూచా తప్పకుండ ఫాలో అవుతున్నాడట మెహర్ రమేష్.
మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సలహాలను అనుసరించడం వల్ల ‘వాల్తేరు వీరయ్య’ ఫలితం ఈరోజు ఎంత అద్భుతంగా వచ్చిందో మన అందరం చూసాము,ఇప్పుడు ‘భోళా శంకర్’ కూడా అలాగే కలిసొస్తుందని అంటున్నారు అభిమానులు..ఈ చిత్రం లో హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా, చిరంజీవి కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది.అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ కి ఊహించిన దానికంటే అద్భుతంగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.

అయితే అభిమానులు ఈ సినిమా ఫలితం పట్ల కాస్త భయం వ్యక్తం చేస్తున్నారు..ఎందుకంటే ప్రస్తుతం రీమేక్ సినిమాలను జనాలు అస్సలు ఆదరించడం లేదు, దానికి ఉదాహరణ మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ చిత్రమే, మలయాళం సూపర్ హిట్ లూసిఫెర్ కి రీమేక్ గా తెరకెక్కిన సినిమా కావడం తో ఈ సినిమాకి లాంగ్ రన్ రాలేదని అభిమానులు అంటున్నారు..మరి మెగాస్టార్ తన మ్యాజిక్ తో ఈ సినిమాని గట్టెక్కిస్తాడో లేదో చూడాలి.