Train Ticket Waiting List: సుదూరం ప్రయాణం చేయాలంటే ట్రైన్స్ సౌకర్యవంతంగా ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో చాలా దూరం వెళ్లొచ్చు. అయితే సమయానికి అనుకున్న టికెట్లు దొరకవు. దీంతో ఒక్కోసారి Waiting List లో టికెట్లు ఉంటే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇవి చాట్ ప్రిపేర్ అయ్యేసరికి కన్ఫామ్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కాకపోతే మాత్రం జనరల్ టికెట్స్ కిందికే వస్తాయి. అయితే మన Waiting List లో బుక్ చేసుకున్నా.. టికెట్ కన్ఫామ్ కాకపోతే ఎవరేం చేయలేం. కానీ ముందే మనం ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే మన Waiting List టికెట్ కచ్చితంగా కన్ఫామ్ అవుతుంది..
ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనం డబ్బులు పెట్టి కొన్న టికెట్ తో పాటు డబ్బులు కూడా పోతాయి. చాలా మంది చివరి నిమిషంలోనూ కన్ఫామ్ అయ్యే చాన్స్ ఉంటుందని రిజర్వేషన్ బోగిలోకి ఎక్కేస్తారు. కానీ చార్ట్ ప్రిపేర్ అయ్యే సమయంలో క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయం మీరు గ్రహించక చెకింగ్ సమయానికి మీ టికెట్లు కన్ఫామ్ కాకపోతే టీసీ మీపై జరిమానా విధించవచ్చు. లేదా ఒక్కోసారి జైలుకు కూడా పంపవచ్చు. అయతే ముందే జాగ్రత్తపడితే ఈ సమస్య అస్సలు ఉండదు. అందుకోసం చిన్న పనిచేయాలి.
మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే ముందే makemytrip టైప్ చేయాలి. ఈ వెబ్ సైట్ ఓపెన్ అయిన తరువాత ట్రైన్ ను చూస్ చేసుకోవాలి. ఆ తరువాత బుక్ ట్రైన్ టికెట్ ను క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించగలవో సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇందులో కొన్ని ట్రైయిన్స్ కు మాత్రం కచ్చితంగా ట్రిప్ కన్ఫామ్ అని ఉంటుంది. దానిని మాత్రమే ఎంచుకోవాలి. ఆ తరువాత దానిని బుక్ చేసుకోవాలి. ఈ ట్రైన్ ఆర్ ఏసీలో ఉన్నా.. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా.. చార్ట్ ప్రిపేర్ సమయానికి కచ్చితంగా బుక్ అవుతుంది.
అయితే మీ టికెట్ కన్ఫామ్ కాకపోతే మీరు బుక్ చేసుకున్న టికెట్ అమౌంట్ కు త్రిబుల్ కలిపి చెల్లిస్తుంది. ఇలా చేసుకోవడం ద్వారా కన్ఫామ్ అవుతుందో లేదోనన్న టెన్షన్ తగ్గుతుంది. ఒకవేళ కన్ఫామ్ కాకపోతే 3 రేట్ల అమౌంట్ తిరిగి వస్తుంది. దీంతోమీరు అనుకున్న ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.