Train Ticket: మనలో చాలామంది తరచూ రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలని అనుకుంటే రైలులో ప్రయాణం చేయడానికే ఎక్కువమంది ఆసక్తి చూపుతారు. రైలు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ట్రైన్ టికెట్ ను కలిగి ఉండాలి. అయితే చాలామంది రైలు ప్రయాణం చేయడానికి మాత్రమే టికెట్ ఉపయోగపడుతుందని భావిస్తారు. అయితే రైలు టికెట్ వల్ల ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
వెయిటింగ్ రూమ్, క్లాక్ రూమ్ బెనిఫిట్స్ తో పాటు ట్రైన్ టికెట్ ద్వారా ప్రమాద పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా రైలు టికెట్ ను బుక్ చేసుకునే సమయంలో 49 పైసలు చెల్లిస్తే ప్రయాణికులు సులభంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ప్రమాదం జరిగితే 2 లక్షల రూపాయల వరకు చికిత్స కోసం పొందే అవకాశం ఉంటుంది.
అలా కాకుండా ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ప్రమాద పరిహారం అందుతుంది. రైలు ప్రయాణం చేస్తున్న సమయం ఏ కారణం వల్ల అయినా అంగ వైకల్యం సంభవిస్తే 7.5 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణ సమయంలో అనారోగ్యం సంభవిస్తే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ను టీటీఈ సహాయంతో పొందే అవకాశం ఉంటుంది.
రైలు ప్రయాణికులకు క్లాక్ రూమ్, లాకర్ ఫెసిలిటీ, రెస్ట్ రూమ్ లాంటి సౌకర్యాలు కూడా ఉండగా కొన్ని సౌకర్యాల కోసం ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణికులు అవగాహనను కలిగి ఉంటే ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.