Bruce Lee
Bruce Lee: మార్షల్ ఆర్ట్స్ పేరు వినగానే బ్రూస్ లీ పేరు గుర్తుకు వచ్చింది. ఇప్పటి తరానికి ఈయన తెలియకపోయినా ఆయన నటించిన సినిమాలు, ఫైట్స్ అలరిస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలతోనే ప్రపంచ గుర్తింపు పొందిన బ్రూస్ లీ ‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయ్యారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆయన చనిపోయారు. అంతకుముందు చాలా సినిమాల్లో వచ్చినా ‘ఎంటర్ ది డ్రాగన్ ’తో పాపులర్ కావడంతో ఆయన సినిమాలన్నీ వేసుకొని మరీ చూశారు. అయితే బ్రూస్ లీ చనిపోవడానికి వైద్యులు ఇప్పటికీ కారణాన్ని గుర్తించలేదు. కానీ కొందరు మాత్రం ఏం చెప్పారో తెలుసా?
బ్రూస్ లీ కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో 1940 నవంబర్ 27న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు హాంకాంగ్ కు చెందిన వారు. ఆయన తండ్రి ఓపెరా గాయకుడు. తన ఒపెరా యాత్రలో భాగంగా శాన్ ప్రాన్సిస్కో నగరంలోని చైనా టౌన్ కి వెళ్లాడు. ఇక్కడే బ్రూస్ లీ జన్మించడంతో ఆయనకు అమెరికా పౌరసత్వంతో పాటు హాంకాంగ్ దేశాల నుంచి సభ్యత్వాలు లభించాయి. బ్రూస్ లీ 9 సంవత్సరాల వయసులో ఉండగా తండ్రితో కలిసి ద కిడ్ అనే సినిమాలో నటించారు. ఆయన 18 సంవత్సరాల వయసు వరకు 20 చిత్రాల్లో నటించారు.
బ్రూస్ లీ చిన్నప్పటి నుంచి పీడ్ ఫైటింగ్ టెక్నిక్ ను నేర్చుకున్నాడు. ప్రైవేట్ గా కుంగ్ ఫూ పాఠాలు చెప్పేవాడు. ఇలా ఆయన గంటకు 275 డాలర్లు తీసుకునేవాడు. కనురెప్పకంటే స్పీడ్ గా బ్రూస్ లీ ఫైట్ చేయగలడు. ఒక అంగుళం దూరం నుంచే పవర్ ఫుల్ పంచ్ ఇవ్వడంలో నేర్పరి. ఇలా కుంగ్ ఫూలో ప్రావీణ్యం సాధించిన బ్రూస్ లీ మరోవైపు సినిమాల్లో నటించారు. 1969 లో మార్లో అనే చిత్రం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
అయితే ఆయన నటించిన 1973లో ‘ఎంటర్ ది డ్రాగన్’ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ బ్రూస్ లీ మరణాంతరం విడుదల అయింది. ఇదే సంవత్సరరం జూలై 20న ఈ సినిమా కోసం డబ్బింగ్ చెబుతుండగా కుప్పకూలిపోయాడు. ఆ తరువాత వెంటనే కోమాల్లోకి వెళ్లిపోయాడు. అయితే బ్రూస్ లీ మరణం పై ఇప్పటికీ మిస్టరీ వీడలేదు. వైద్యులు మాత్రం అతనికి సెరిబ్రల్ ఎడేమీ వ్యాధి అని చెబుతున్నారు. కొందరు వైద్యులు పెయిన్ కిల్లర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యారని అంటున్నారు. ఆయన చికిత్స పొందతున్న సమయంలో బ్రూస్ లీ కోలుకుంటారని చెప్పారు. కానీ అనారోగ్యానికి గురైన కొద్ది రోజుల్లోనే మరణించారు.