Shakuni Temple: మనకు మహాభారతం తెలుసు. మహాభారతం ఓ మహాకావ్యం. అందులోని పాత్రలు కూడా బాగా తెలుసు. పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన యుద్ధమే మహాభారతం. అయితే దాన్ని రక్తికట్టించడంలో ప్రముఖ పాత్ర పోషించింది మాత్రం శకుని. అతడి పేరు వింటేనే ప్రస్తుతం మన సినిమాల్లో విలన్ గా చూస్తారు. అంతటి దుష్టపాత్ర పోషించడం ఒక శకునికే చెల్లింది. కానీ స్వభావరీత్యా శకుని మంచివాడేనట. కౌరవుల సాన్నిహిత్యంలో అతడు కరడుగట్టిన వాడిగా చిత్రీకరించబడ్డాడు. మహాభారతమనే ఎపిసోడ్ లో ప్రధాన పాత్ర కూడా శకునిదే కావడం విశేషం. మాయా గవ్వల రూపకల్పనతో శకుని పాండవుల వనవాసం ఖరారైందని తెలిసిందే.
ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. మన దేశంలో అందరికి ఆలయాలు ఉన్నాయి. ప్రతి దేవుడికి ఓ ఆలయం కచ్చితంగా ఉంది. కానీ శకునికి మాత్రం ఎలాంటి ఆలయం లేదని అనుకుంటుంటారు. కానీ అతడికి కూడా ఆలయం ఉంది. అది ఎక్కడో కాదు మన దేశంలోని కేరళలో ఉంది. పవిత్రేశ్వరం అని పిలిచే ఊరిలో ఆయుధాలను ఇప్పటికి కూడా రహస్యంగా ఉంచుతారు. మాయంగోడు మాలాన్ సరవు మలనాడా ఆలయం ఉంది. ఇక్కడే శకుని ఆలయం ఉంది.
Also Read: KGF Real Story: కేజీఎఫ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏంటో తెలుసా?
శకునికి అన్ని దేవుళ్లకు చేసినట్లే పూజలు చేస్తారు. శ్రీకృష్ణుడే ధర్మ రక్ష పరిరక్షణకు పూనుకుని శకునితో ఆ పనులు చేయించాడని చెబుతారు. అంతేకాని శకునికి ఆ పనులు ఇష్టం లేదని తెలుస్తోంది. మొత్తానికి మహాభారతం అంతటి మహత్తర కావ్యంగా రూపుదిద్దుకోవడంలో శకుని పాత్రే కీలకం కావడం గమనార్హం. దుర్మార్గుల పాలిట నిలబడినా వారి అంతానికి కారకుడయ్యాడు. అంతేకాని శకుని చేసింది ఏమీ లేదని చెబుతారు. అందుకే రామయణంలో రావణసూరుడు, మహాభారతంలో శకుని అత్యంత ప్రతిభాశాలులుగా కీర్తించబడటం తెలిసిందే.
శకుని ఆలయానికి భక్తులు ఏ వేళలో అయినా వెళతారు. నిత్యం పూజలందుకుంటుంటాడు పరిస్థితుల ప్రభావం చేత కూడా కొందరు నిందలకు గురవుతారు. దుష్టులతో చేరితే దుష్టుడే అవుతాడు. మంచివారితో స్నేహం చేస్తే మంచివాడిగానే మారతాడు. ఇక్కడ శకుని దుష్టులైన కౌరవుల సాన్నిహిత్యంలో వారి మెప్పు కోసం కుట్రలు, కుతంత్రాలు చేసినట్లు తెలుస్తోంది. అందుకే దుష్ట పాత్రలకు ఉదాహరణగా శకుని గురించే చెప్పడం చూస్తుంటాం. అంతటి రోల్ మోడల్ గా ఎదిగిన శకుని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
Also Read:Teenmar Mallanna: బీజేపీకి గుడ్ బై.. ‘టీం-7200’.. కొత్త పార్టీ దిశగా తీన్మార్ మల్లన్న