KGF Real Story: కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) కు ఘనమైన చరిత్ర ఉంది. కానీ ఇది ఎవరికి తెలియని ఓ గ్రామమని తెలుసా? కేజీఎఫ్ సినిమా ఇప్పుు భారతదేశాన్ని కలెక్షన్ల వర్షంతో కొల్లగొట్టింది. కానీ ఇక్కడ పరిస్థితులు వింటే ఆశ్చర్యం వేస్తోంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఓ ప్రాంతం గురించి సినిమాగా తీసి దాంతో కూడా కోట్లు సంపాదించారంటే సామాన్యమైన విషయం కాదు. దీనికి చాలా కృషి, పట్టుదల ఉండాలి. విశ్వాసంతోనే ఏదైనా సాధించవచ్చని వారు నిరూపించారు. మరుగున పడిన ఓ గ్రామాన్ని మళ్లీ తెరమీదకు తీసుకొచ్చి ప్రపంచానికే చాటిచెప్పారు.
కోలార్ బంగారు గనులున్న ప్రాంతం రాజరికపు పాలన నుంచి నేటి వరకు అక్కడ దుర్భర పరిస్థితులే కనిపిస్తాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రదేశాన్ని లిటిల్ ఇంగ్లండ్ గా పిలిచేవారు. కర్ణాటకలోని ఓ జిల్లాయే కోలార్. ఇక్కడ రాబెర్ట్ సోన్ పేట గనుల తవ్వకాలకు కేంద్రంా పిలవబడేది. హరప్పా, మెహంజొదారో నాటికే ఇక్కడ బంగారం వెలికితీసేవారు. రానురాను బంగారం తరిగిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2001లో గనులను మూసివేసింది.
Also Read: Teenmar Mallanna: బీజేపీకి గుడ్ బై.. ‘టీం-7200’.. కొత్త పార్టీ దిశగా తీన్మార్ మల్లన్న
క్రీ.శ. రెండో శతాబ్ధం వరకు కోలార్ ప్రాంతం గురించి ఎవరికి తెలియదు. దాన్ని గంగాలు ఆక్రమించాక కాని విషయం ప్రపంచానికి తెలియలేదు. గంగాలు దాదాపు వెయ్యేళ్లు దీన్ని పాలించినట్లు తెలుస్తోంది. క్రీ.శ. 1004లో చోళులు కోలార్ ను స్వాధీనం చేసుకుని దీనికి నికారిలిచోళ మండలంగా పిలిచేవారు. 1117లో హోయసాళులు చోళులను ఓడించి ఈప్రాంతాన్నితమ వశం చేసుకున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తరువాత శ్రీకృష్ణ దేవరాయలు సైతం ఈ ప్రాంతాన్ని దాదాపు 300 ఏళ్లు పాలించినట్లు తెలుస్తోంది. కదంబాలు, చాళుక్యులు, పల్లవులు వైదంబాలు, రాష్ర్టకూటులు, చోళులు, హోయసాళులు ఇలా ఎన్నో రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి.
బ్రిటిష్ వారి కాలంలో కూడా ఇక్కడ తవ్వకాలు జరిగాయి. మన దేశస్తులనే బానిసలుగా చేసుకుని బంగారం వేటకొనసాగించేవారు. ఇంతటి చారిత్రకమైన ప్రదేశంగా వెలుగొందిన ఇక్కడ సదుపాయాలు మాత్రం శూన్యం. ఆ ఊరికి సరైన రోడ్డు సౌకర్యం లేదు రైల్వే స్టేషన్ ఉన్నా ప్రజలు దాని మీద ఆధారపడరు వారునిత్యం ఆటోల్లో వెళ్లాల్సిందే. అందుకే వారు చెల్లించే మొత్తం రూ. 60. ఇలా ఏసౌకర్యాలు లేకున్నా ఇంతటి చారిత్రకమైన ప్రదేశం ప్రపంచానికి తెలియకుండా పోతోందనే ఉద్దేశంతో కేజీఎఫ్ పేరుతో సినిమా తీసి దాదాపు రూ. 1000 కోట్లు కొల్లగొట్టడం తెలిసిందే.
ఇక్కడ మంచినీరు కూడాదొరకదు. ప్రజలు ట్యాంకర్ మీదే ఆధారపడతారు. నీళ్ల కోసం కూడా వీరు రూ. 60 ఖర్చుచేయల్సిందే. రేడియేషన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతాయి. దీంతో ఇక్కడ జీవనం నిత్యనరకమే. అయినా ప్రజలు మాత్రం ఇక్కడనుంచి ఎక్కడికి వెళ్లడం లేదు. మాజీ ప్రధాని నెహ్రూ హయాంలో ఒక దశలో ప్రపంచ బ్యాంకు ఇండియాకు అప్పు ఇచ్చేందుకు వెనుకాడితే కోలార్ గనులనుచూపించి ఆయన రుణం పొందినట్లు తెలుస్తోంది. ఇంతటిగొప్ప చరిత్ర కోలార్ గనులకు ఉండటం విశేషం.
కాలక్రమంలో కోలార్ గనుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా దీని చరిత్ర గురించి ఎవరు ఆరా తీయడం లేదు. ఇంతటి చరిత్ర కలిగిన ప్రాంతమైనా నిరాదరణకు గురవుతోంది. ఉపయోగించుకున్న నాళ్లు బంగారం తవ్వుకుని ఇప్పుడు ఎవరికి పట్టని విధంగా చేశారు.దీంతో ఈ ప్రాంతం గురించి వింటే మనకే బాధ కలుగుతోంది. కానీ పాలకులు మాత్రం వీటి గురించి ఏ దశలోనూ స్పందించడం లేదనితెలుస్తోంది. ఇప్పటికైనా దీనికి తగిన గుర్తింపు వస్తుందో లేదో వేచిచూడాల్సిందే.
Also ReadKA Paul Attack: ద్యావుడా… కేఏ పాల్ చెంప పగులకొట్టారే!
Recommended Videos: