Holi: హోలీ రోజు ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు తెలుసా?

Holi: హోలీ పండుగ జరుపుకునేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. మార్చి 8న దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దక్షిణాది కంటే ఉత్తరాదిలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కొత్త బట్టలు ధరిస్తారు. అయితే హోలీ పండుగ నిర్వహణలో కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకొచ్చుకోవడంతో శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. ఇంట్లోకి సంపద వస్తుందని నమ్ముతుంటారు. హోలీ నాడు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవని అంటుంటారు. దీంతో సంతోషాలు వెల్లివిరుస్తుంటాయని చెబుతుంటారు. […]

Written By: Srinivas, Updated On : March 5, 2023 5:15 pm
Follow us on

Holi: హోలీ పండుగ జరుపుకునేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. మార్చి 8న దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దక్షిణాది కంటే ఉత్తరాదిలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కొత్త బట్టలు ధరిస్తారు. అయితే హోలీ పండుగ నిర్వహణలో కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకొచ్చుకోవడంతో శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. ఇంట్లోకి సంపద వస్తుందని నమ్ముతుంటారు.

హోలీ నాడు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవని అంటుంటారు. దీంతో సంతోషాలు వెల్లివిరుస్తుంటాయని చెబుతుంటారు. హోలీ పండుగ రోజు వెండి నాణాన్ని, పట్టీలను, ఉంగరాన్ని కొనుగోలు చేయడం వల్ల బాగా కలిసి వస్తుందని ప్రజల విశ్వాసం. వెండి నాణెం ఇంట్లో ఉంచుకోవడం వల్ల, వెండి పట్టీలను ధరించడం వల్ల, వెండి ఉంగరం పెట్టుకోవడంతో ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందని అంటారు. అంతేకాదు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు.

హోలీ పండుగ రోజు ఇంటి ప్రధాన ద్వారానికి తోరణాలు కట్టడం కూడా మంచిదే. ఇంటికి కొత్త అక్వేరియం తెచ్చుకుని దాన్ని సరైన దిశలో పెట్టి చేప పిల్లలను పెంచితే కూడా కలిసి వస్తుందని ప్రగాఢ విశ్వాసం. అక్వేరియం ఉత్తరం లేదా ఈశాన్యంలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. వెదురు మొక్కను తెచ్చి నాటి దాని సంరక్షణ చేయడం కూడా ఇంకా శుభంగా పరిగణిస్తారు. ఇలా వెదురు మొక్కను తెచ్చి పెట్టడం మూలంగా ఇంట్లోకి సానుకూల శక్తులు వస్తాయని చెబతారు.

Holi 2022

Also Read: Traditions : పుట్టింటి నుంచి ఆడపడుచు ఏం తీసుకెళ్లకూడదు?

ఇంకా ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవడం వల్ల కూడా ఎంతో ఎనర్జీ వస్తుంది. ఆర్థిక పురోగతి బాగుంటుంది. చైనీస్ వాస్తు ప్రకారం డ్రాగన్ విగ్రహం లేదా చిత్రం తెచ్చుకోవడం వల్ల కూడా ఇంట్లోకి చెడు తొలగిపోయి మంచి శక్తులు వస్తాయని నమ్మకం. హోలీ రోజు అదృష్టం కలిసి రావడానికి అనేక రకాల చిట్కాలు ఉపయోగించడం వల్ల ఎన్నో విధాలుగా శుభాలు కలుగుతున్నాయని భక్తుల నమ్మకంగా చెబుతుంటారు. ఇలా మనం పండుగ రోజు ఈ పనులు చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులను ఆహ్వానించుకోవడం వల్ల మనకు మేలు కలుగుతుందని నమ్ముకోవాలి.

 

Also Read: Traditions : పుట్టింటి నుంచి ఆడపడుచు ఏం తీసుకెళ్లకూడదు?

Tags