
Male infertility: ఇటీవల కాలంలో వంధ్యత్వం వేధిస్తోంది. చాలా మంది జంటలు సంతాన సాఫల్యం లేక సతమతమవుతున్నారు. పెళ్లయి ఏడాది లోపు అయితేనే సంతానం అయినట్లు లేదంటే వారికి భవిష్యత్ లో కలుగుతారనే ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుత జీవన శైలి కూడా ఒక కారణంగా నిలుస్తోంది. గతంతో పోల్చితే ఈ సమస్య ఇప్పుడు జఠిలంగా మారింది. వంధ్యత్వానికి సంబంధించిన కేసుల్లో 35-40 శాతం జంటల్లో పురుషులదే తప్పుగా కనిపిస్తోంది. దీంతో వీర్య కణాల సంఖ్య పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎంతో మంది ఆడవారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు ఇక సంతాన భాగ్యం లేదనే వేదనతో భారంగా నిట్టూరుస్తున్నారు.
గర్భధారణను ప్రభావితం చేసే అంశాల్లో పురుషుల జీవనశైలి కూడా ఒక కారణంగా నిలుస్తోంది. మద్యపానం, ధూమపానం, నిద్రలేమి, ఒత్తిడి, ఆహార అలవాట్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలకు కేంద్రంగా నిలుస్తున్నారు. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడానికి పరోక్షంగా ఇవి కారణాలుగా అవుతున్నాయి. ఇంకా వ్యాయామం చేయకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం కూడా మరో రకమైన విధంగా కారణాలుగా చెబుతున్నారు. ఈ క్రమంలో వీర్య కణాల సంఖ్య పెరిగేందుకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు.

ఊబకాయం కూడా సంతాన సాఫల్యతకు అడ్డుగా నిలుస్తోంది. దీంతో మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల కూడా సంతాన సాఫల్యత దక్కడం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇది సంతాన ఉత్పత్తిని ప్రేరేపించేదిగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పురుషుల్లో సంతానోత్పత్తికి కారణమయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ పెంచుకునేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదు.
ఆస్ట్రేలియాలో జరిపిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వీర్య కణాల సంఖ్య పెరగడంలో కీలక పాత్ర పోషించే పలు రకాల క్రియలకు ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల డీఎన్ఏ కాపీ చేయబడినప్పుడు మగవారిలో వంధ్యత్వం సమస్య ఏర్పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వీర్య కణాల సంఖ్య పెరుగుదలలో లోపాలు ఏర్పడుతున్నాయని అందుకే సంతానం కలిగేందుకు సరిపోవడం లేదని చెబుతున్నారు. వీర్యం నాణ్యతలో తగ్గుదల వృషణ క్యాన్సర్ మరియు క్రిస్టోర్కిడిజంతో సహా పురుషుల వంధ్యత్వం గణనీయంగా పెరిగింది. స్త్రీలలో కూడా వంధ్యత్వం పెరిగింది. భవిష్యత్ లో ఈ సమస్య ఎక్కడికి దారి తీస్తుందో తెలియడం లేదు.