
ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. చదువుకోని వారితో పోలిస్తే చదువుకున్న వారే ఈ మోసాల బారిన ఎక్కువగా పడుతూ ఉండటం గమనార్హం. సైబర్ మోసగాళ్లు మాయమాటలు చెప్పి అవతలి వ్యక్తులు మాటలను నమ్మేలా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. తెలివిగా మోసాలు చేస్తూ ఖాతాలలోని డబ్బులు కొల్లగొడుతున్నారు. సైబర్ నిపుణులు మన మొబైల్ కు “కొత్త సిమ్ యాక్టివేషన్ కు ప్రక్రియ మొదలైంది” అనే మెసేజ్ వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?
సైబర్ మోసగాళ్లలో చాలామంది ప్రధానంగా సిమ్ స్వాపింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఎల్‌బీగర్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ హరినాథ్ రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కీలక సూచనలు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివశించే ఒక వ్యక్తికి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)లో అకౌంట్ ఉంది. తన అకౌంట్ నంబర్ కు మొబైల్ నంబర్ ను లింక్ చేశాడు.
తరచూ మొబైల్ నంబర్ సహాయంతో ఆ వ్యక్తి లావాదేవీలు జరిపేవాడు. అయితే ఊహించని విధంగా అతని మొబైల్ నంబర్ పని చేయడం ఆగిపోయింది. అనంతరం ఆయన బ్యాంక్ ఖాతాల నుంచి 25 లక్షల 16 వేల వేరే ఖాతాకు బదిలీ అయినట్లు తేలింది. పోలీసులు విచారణ జరిపి నలుగురు నిందితులలో ఒకరిని పట్టుకున్నారు. సైబర్ నిపుణులు కొత్త సిమ్ యాక్టివేషన్ మెసేజ్ వస్తే వెంటనే అలర్ట్ కావాలని సూచిస్తున్నారు.
వెంటనే సర్వీస్ ప్రొవైడర్ కు, బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలుపుతున్నారు. ఎవరైనా బ్యాంకుల నుంచి ఫోన్ చేశామని చెబితే వాళ్లకు ఖాతాలకు సంబంధించిన సమాచారం ఇవ్వవద్దని… ఆన్ లైన్ లో బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఎటువంటి వివరాలను పొందుపరచవద్దని కోరుతున్నారు. 18004256235 నంబర్ కు కాల్ చేసి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సమాచారం పొందవచ్చని చెబుతున్నారు.
Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?