జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని… రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని… రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెబుతోంది. అయితే జగన్ సర్కార్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేకుండా పోయింది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో విద్యుత్ మీటర్ల వ్యవహారం కొత్త చర్చకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?
ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాలలో నగదు జమవుతుందని… ఆటో డెబిట్ సౌకర్యం ద్వారా బిల్లులు చెల్లించవచ్చని చెబుతున్నా రైతులు మాత్రం వైసీపీ మాటలను నమ్మడం లేదు. మరోవైపు వ్యవసాయ మీటర్ల ద్వారా రైతులు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని టీడీపీ చేస్తున్న ఆరోపణలు కూడా రైతుల్లో కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మీటర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోయినా మీటర్లు పెట్టే దిశగానే రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయి,
మరి రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకునే జగన్ సర్కార్ రైతులకు ఇష్టం లేకపోయినా మీటర్ల దిశగా ఎందుకు అడుగులేస్తోందనే ప్రశ్నలకు ఆసక్తికరమైన విషయాలు సమాధానాలుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు తాజాగా మీటర్ల వెనుక ఉన్న అసలు విషయాలను బయటపెట్టారు. కేంద్రం బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టిస్తే 2,500 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెప్పిందని పేర్కొన్నారు.
ఏపీ మాత్రం తెలంగాణతో పోలిస్తే జనాభా పరంగా పెద్ద రాష్ట్రం కావడంతో 4,000 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని చెప్పారు. తెలంగాణ కేంద్రం ఆఫర్ ను రిజెక్ట్ చేసిందని… అయితే ఏపీ మాత్రం ఆ ఆఫర్ నచ్చి బోరుబావులకు మీటర్లు పెట్తే అడుగులు వేస్తోందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని… మీటర్ల విషయంలో కేంద్రం నిధులకు తెలంగాణ సర్కార్ కక్కుర్తి పడదని అన్నారు.
Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..?